IPL 2022 Auction: ఐపీఎల్ వచ్చే సీజన్ లో టీంలన్నీ మారిపోతాయి. కేవలం నలుగురిని మాత్రమే అట్టిపెట్టుకొని మిగతా వారిని వేలంలోకి వదలడంతో మెరుగైన ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలన్నీ మెగా వేలంలో కోట్లు కుమ్మరించేందుకు రెడీ అయ్యాయి.
ఈ వేలంలో తాజాగా 49మంది ఆటగాళ్లను రూ.2 కోట్ల బేస్ ధరకు నిర్ణయించారు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ , భారత స్పిన్నర్ ఆ అశ్విన్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబాడ, వెస్టిండ్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.
Also Read: ‘ప్రియాంక’కి ఆడబిడ్డ.. పైగా 12 వారాల ముందే జన్మించింది !
నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ దిగ్గజ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను పక్కనపెట్టి పెద్ద తప్పు చేసింది. అతడిని ఐపీఎల్ లో ఫాంలో లేని కారణంగా దాదాపు తొలగించింది. దీంతో అతడు యూఏఈలో జరిగిన ప్రపంచకప్ టీ20లో చెలరేగి ఆడి మ్యాన్ ఆఫ్ దిసిరీస్ గా నిలిచాడు. ఏకంగా తన టీంకు కప్ ను అందించాడు. ఇక ఇతడితోపాటు ఫైనల్ లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైన మిచెల్ మార్ష్ కూడా ఇప్పుడు వేలంలో రూ.2 కోట్ల బేస్ ధరకు ఫుల్ డిమాండ్ ఉన్న ఆటగాళ్లుగా ఉన్నారు.
అయితే దిగ్గజ ఆటగాళ్లు అయిన బెన్ స్టోక్స్, క్రిస్ గేల్, సామ్ కరణ్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్ల పేర్లను చేర్చారు. ఈ ఆటగాళ్లు గతంలో ఐపీఎల్ లో మెరుగ్గా రాణించినప్పటికీ ఈ మెగా వేలంలో వారి బేస్ ధరలో ఎటువంటి పెరుగుదల లేదు.
రూ.2 కోట్ల బేస్ ధరలో భారత్ నుంచి 17 మంది ప్లేయర్లు వేలంకు సిద్ధంగా ఉన్నారు. ఇక 32 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు. భారత్ నుంచి అశ్విన్ తోపాటు శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సురేష్ రైనా పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక విదేశీ ఆటగాళ్లలో వార్నర్, రబాడా, బ్రావో, కమిన్స్, ఆడమ్ జంపా, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హాసన్, మార్క్ వుడ్, ట్రెంట్ బౌల్ట్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి దిగ్గజాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఇక మెగా వేలం కోసం మొత్తం 1214 మంది క్రికెటర్లు నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో ఈ మెగా వేలం జరుగనుంది.
Also Read: విజయ్ దేవరకొండ మరో చిరంజీవి అవుతాడా..?