Rashmi Gautam: యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై.. పలు సినిమాల్లో హీరోయిన్గా కనిపించి అలరించిన నటి రష్మీ గౌతమ్. తన మాటతీరుతో ప్రస్తుత టాప్ యాంకర్స్‌లో ఒకరుగా ట్రెండింగ్‌లో నిలుస్తోంది. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్గా నిటంచి.. ప్రస్తుతం పలు షోలతో పాటు సినిమాల్లోనూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈభామ. కెరీర్లో ఎంత బిజీ ఉన్నా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు విషాయాలపై స్పందిస్తూ ఉంటుంది రష్మి. హాట్ ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది. మరోవైపు, సమాజంలో జరుగుతున్న ఘటనలపైనా తనదైన స్టైల్లో రియాక్ట్ అవుతూ ఉంటుంది.

ముఖ్యంగా మూగజీవులపై జరిగే దాడులపై.. వాటికి హాని కలిగించే విషయాలపై స్పందిస్తూ.. సమాజంలో ఉన్న అవిటితనాన్ని కళ్లకు కట్టినట్లు చెబుతుంది. తాజాగా, మరోసారి అలాంటి పోస్ట్ చేస్తూ.. ఎమోషనల్ అయ్యింది రష్మి. ఇటీవల దీపావళికి పశ్చిమ బెంగాల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంబరాల్లో భాగంగా కొందరు ఆకతాయిలు.. వీధి కుక్క తోకకు బాణాసంచ కట్టి పేల్చారు. దీంతో ఆ కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి.
తోక కూడా తెగిపోయింది. ఇది గమనించిన కొంతమంది.. కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిక్స చేయించారు. ప్రస్తుతం ఆ శునకం సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న రష్మి.. తనదైన స్టైల్లో స్పందించింది. సమాజంలో మానవత్వం చచ్చిపోయిందంటూ భావోద్వేగంతో వ్యాఖ్యానించింది. అలాంటి మనుషులకు ఈ భూమిపై బతికే హక్కు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్మిక పోస్ట్‌కు నెటిజన్లు సైతం సపోర్ట్ చేస్తూ.. ఆ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కామెంట్స్ చేస్తున్నారు.