Petrol Price in AP: పెట్రో ధరలపై విమర్శలు పెరుగుతున్నాయి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెట్రో ధరలు తగ్గించినా తెలుగు ప్రాంతాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. ఏపీలో బీజేపీ, వైసీపీ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. బీజేపీపై మంత్రులు కౌంటర్లు ఇస్తుంటే దానికి తగినట్లుగా బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శల దాడి కొనసాగుతోంది,. దేశంలోని అన్ని ప్రాంతాలు తగ్గించినా ఏపీ మాత్రం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
రెండు పార్టీల మధ్య విమర్శల వెల్లువ కొనసాగుతోంది. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు నిందించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు మంత్రుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. వారికి ఎర్రిపుష్పం అవార్డులు ఇస్తామన్నారు. పద్మశ్రీ అవార్డుల మాదిరి వీటిని అందజేస్తామని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల ఆగడాలపై వీర్రాజు తనదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.
దేశమంతా పెట్రో ధరలు తగ్గిస్తుంటే ఏపీ మాత్రం పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల గురించి కూడా స్పందించడం లేదు. పెట్రో ధరలపై వస్తున్న ఆదాయంతో ఏపీ మనుగడ సాగించడం దారుణం. పెట్రో భారంపై ఏపీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వీర్రాజు మండిపడుతున్నారు.
కేంద్రం ధరలు తగ్గిస్తున్నా ఏపీ మాత్రం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం జనాన్ని పట్టించుకోకుండా చేస్తున్నారు. దీంతో ప్రజలపైనే పెనుభారం మోపుతోంది. కేంద్రంపై అభాండాలు వేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీ ప్రజలను పావులుగా వాడుకుంటోంది.
Also Read: పెట్రో భారం.. కేంద్రంపైనే ఆధారమా?