
Kailash Kher: పాట బాగా రావాలి అంటే.. సింగర్ లో మంచి మ్యాటర్ ఉండాలి. గాత్రం ఒక్కటే సరిపోదు. గొంతులో బలమైన భావోద్వేగాల సమ్మేళనం కూడా ఉండాలి. ముఖ్యంగా హై పిచ్ పాటలకు గాత్రం పై మంచి పట్టు ఉండాలి. అయితే, అలాంటి గాత్రానికి ఖైలాష్ ఖేర్ పెట్టింది పేరు. తన గాత్ర మధురిమతో ఎన్నో గొప్ప పాటలకు ప్రాణం పోశాడు ఆయన.

తెలుగులో కూడా ఆయన ఎన్నో పాటలను అద్భుతంగా పాడి, వాటిని జనంలోకి బాగా తీసుకు వెళ్ళాడు. ఆయన గాత్రం కారణంగా ఆ పాటలతో ఆయా సినిమాలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. అందుకే ఈ అగ్ర గాయకుడు పాడిన పాటలకు ఇప్పటికీ మంచి గిరాకీ ఉంది. తాజాగా ఆయన పాడిన తెలుగు పాట ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
“పుష్పక విమానం” అనే చిన్న సినిమాలో ఖైలాష్ ఖేర్ “ఆహా” అంటూ ఆయన ఒక పాటను చాలా బాగా పాడారు. ఈ సాంగ్ వల్ల ఇప్పుడు ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది. పైగా సిద్ధార్థ్ సదాశివుని అనే కొత్త సంగీత దర్శకుడికి మంచి పేరు వచ్చింది. నిజానికి “ఆహా” పాటను అతను స్వరపరిచిన విధానం కంటే… ఖైలాష్ ఖేర్ పాడిన విధానమే అద్భుతంగా ఉంది.
కానీ, సాంగ్ హిట్ అవడంతో సిద్ధార్థ్ సదాశివునికే ఎక్కువ పేరు వచ్చింది. మొత్తానికి ఖైలాష్ ఖేర్ ఈ సాంగ్ ని ఆయన తన శైలికి భిన్నంగా పాడడంతో పాటు చాలా ఫ్రెష్ గా పాడారు. ఇక ఈ సినిమా కథ కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమా కథలో హీరో భార్య ‘లేచిపోతుంది’. కాన్సెప్ట్ కూడా చాలా ఫన్నీగా ఉండటంతో మాస్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ ఈ నెల 12న విడుదల కాబోతుంది. అన్నట్టు విజయ్ దేవరకొండ ఈ సినిమాకి నిర్మాత. అందుకే ఈ సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.