spot_img
Homeఎంటర్టైన్మెంట్Rashmi Gautam: బాంబ్ పేల్చిన రష్మీ.. వారి టార్చర్ తట్టుకోలేకే ఆ పని చేశా..

Rashmi Gautam: బాంబ్ పేల్చిన రష్మీ.. వారి టార్చర్ తట్టుకోలేకే ఆ పని చేశా..

Rashmi Gautam: బుల్లితెర స్టార్ రష్మీ అంటే కొందరికి ఎనలేని అభిమానం. ఆమె యాంకరే అయినా స్టార్ హీరోయిన్ రేంజ్ లో విపరీత ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఓ వైపు టీవీల్లో.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే రష్మీ పేరు సోషల్ మీడియాలో ఏదో రకంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా రష్మీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఓ సినిమాలో నటించిన రష్మీ.. ఆ సినిమా ప్రమోషన్స్ చేయాలని పట్టుబడుతున్నారని చెప్పింది. వారి టార్చర్ తట్టుకోలేక ఆ పని చేశానని ఈ ముద్దుగుమ్మ సంచలన కామెంట్స్ చేసింది. ఇంతకీ రష్మీ చేసిన పనేంటి..? ఆమెను ఎవరు టార్చర్ పెడుతున్నారు.

Rashmi Gautam
Rashmi Gautam

రష్మీ, నందులు కలిసి ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటించారు. కొన్ని కారణాల వల్ల ఈసినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు నవంబర్ 4న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ష్ కోసం రావాలని నందు రచ్చ చేసిన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ కు ఎందుకు రాదు.. ఆమెకు పొగరు అంటూ నందు కామెంట్స్ చేశారు. అయితే ఆ తరువాత ఇది ఫ్రాంక్ వీడియో అన్నారు. కానీ ఇటీవల ఆమె ఇది ఫ్రాంక్ కాదు.. నిజంగానే సినిమా ప్రమోషన్స్ కోసం రానని చెప్పానని రష్మీ బాంబు పేల్చింది.

ఇటీవల బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘అది ఫ్రాంక్ వీడియో కాదు.. నిజంగానే నేను ప్రమోషన్స్ కు రానని చెప్పా.. సినిమా పూర్తయి రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు దాని గురించి అప్డేట్ లేదు. సడెన్లీగా వచ్చి సినిమా ప్రమోషన్స్ కోసం రావాలి అంటే ఎలా.. నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పా.. అయినా వినకుండా మెసేజ్లు, ఫోన్స్ చేసిన టార్చర్ పెట్టారు. ఆ బాధ భరించలేకే సినిమా ప్రమోషన్స్ కు రానని చెప్పా’అని వివరించింది.

Rashmi Gautam
Rashmi Gautam

‘అలాగే సినిమా ప్రమోషన్స్ కు వస్తే నాకు రకరకాల ప్రశ్నలు ఎదురవుతాయి.. వాటికి సమాధానం చెప్పడం నాకు ఇష్టం లేదు..’ అని అయితే రష్మీ చెప్పింది. దీంతో నెటిజన్లు రష్మీ చేసిన కామెంట్స్ పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ‘మీరు చెప్పే ఆ రకరకాల ప్రశ్నలు అంటే.. ఒకటి సుధీర్ తో పెళ్లి .. మరొకటి అనసూయ ప్లేసులో మీరు రావడం.. వంటివి ఉన్నాయి’ అని మెసేజ్ లు పెడుతున్నారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper