Rao Ramesh: షాకింగ్ నిర్ణయం తీసుకున్న రావు రమేష్.. కారణం అదే

Rao Ramesh: రావు గోపాలరావు గారి అబ్బాయి రావు రమేష్, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. నిజానికి సినీ నేపథ్యం ఉన్నా.. మెగాస్టార్ లాంటి వ్యక్తుల సపోర్ట్ ఉన్నా.. సినిమాల్లో నిలబడటానికి రావు రమేష్, ఎన్నో తిప్పలు పడ్డాడు. గుర్తింపు రాగానే ఇప్పుడు వెనుతిరగకుండా దూసుకు పోతున్నాడు. గమ్యంతో మొదలైన రావు రమేష్ పయనం ఎన్నో విజయాల తీరాలకు ఇప్పటికే చేరింది. అయినా.. ఆయన ప్రయాణం మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. ప్రతి సినిమాలోనూ విభిన్నమైన స్లాంగ్ […]

Written By: Shiva, Updated On : August 17, 2022 2:36 pm
Follow us on

Rao Ramesh: రావు గోపాలరావు గారి అబ్బాయి రావు రమేష్, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. నిజానికి సినీ నేపథ్యం ఉన్నా.. మెగాస్టార్ లాంటి వ్యక్తుల సపోర్ట్ ఉన్నా.. సినిమాల్లో నిలబడటానికి రావు రమేష్, ఎన్నో తిప్పలు పడ్డాడు. గుర్తింపు రాగానే ఇప్పుడు వెనుతిరగకుండా దూసుకు పోతున్నాడు. గమ్యంతో మొదలైన రావు రమేష్ పయనం ఎన్నో విజయాల తీరాలకు ఇప్పటికే చేరింది. అయినా.. ఆయన ప్రయాణం మాత్రం ఇంకా సాగుతూనే ఉంది.

Rao Ramesh

ప్రతి సినిమాలోనూ విభిన్నమైన స్లాంగ్ తో అభినయించి అదరగొడుతున్నాడు రావు రమేష్. రావు రమేష్ నోటి నుంచి వచ్చే ప్రతి డైలాగ్ అభినందన చప్పట్లను అందుకుంటోంది. అందుకే రావు రమేష్ ఇప్పుడు రతనాల నటుడు అయ్యాడు. ఆయన కోసం దర్శక రచయితలు కొత్త కొత్త పాత్రలు రాస్తున్నారు. ముఖ్యంగా రావు రమేష్ విలన్ పాత్రలతో కూడా కామెడీ పండించగల గొప్ప నటుడు అని ఇప్పటికే నిరూపించాడు.

Also Read: Kartikeya 2 Collections: ‘కార్తికేయ 2’ 4 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దుమ్ము దులిపాడు.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?

పైగా తన నటనతో రావు రమేష్ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అయితే, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన విషయాలను రావు రమేష్ చెప్పాడు. ప్రొడ్యూసర్లు బ్రతికితేనే సినిమా స్థాయి పెరుగుతుందని రావు రమేష్ చెప్పుకొచ్చారు. తాను నిర్మాతల నటుడిని అని రావు రమేష్ చెప్పాడు. అందుకే, తన వెంట ఏ అసిస్టెంట్ ఉండరు అని, ఎలాంటి హడావుడి ఉండదు అని రావు రమేష్ స్పష్టం చేశాడు.

నిజమే, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ రేంజ్ ను చూపించుకోవడం కోసం అసిస్టెంట్లను పెట్టుకుంటారు. దాంతో అసిస్టెంట్ల బిల్ కూడా అధికంగా వస్తోంది. పైగా వారికీ కూడా అదనంగా జీతాలు ఇవ్వాలి. ఇవన్నీ నిర్మాతలకు బాగా ఇబ్బందిగా అనిపిస్తాయి. అందుకే.. రావు రమేష్ ఇలా ఎప్పుడు చేయను అంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Rao Ramesh

రావు రమేష్ మాటల్లోనే.. ‘నేనేంటో నాకు బాగా తెలుసు. నా నుంచి దర్శక నిర్మాతలు ఏం కోరుకుంటున్నారో నేను అదే చేస్తాను. కేజీఎఫ్ సినిమా తర్వాత నాకు ఇతర భాషల నుంచి కాల్స్ వచ్చాయి అని ఆయన చెప్పుకొచ్చాడు. మరి ఇంత డిమాండ్ ఉన్న రావు రమేష్ రోజుకు ఎంత తీసుకుంటాడో తెలుసా ?, రోజుకు 2 లక్షలు తీసుకుంటున్నాడు. అయితే, ఇతర భాషల్లో మాత్రం 2 లక్షల 50 వేలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తెలుగులో తన రెమ్యునరేషన్ ను రోజుకు లక్ష యాభై వేలకు తగ్గించుకున్నాడు. తెలుగు సినిమా బాగు కోసమే తానూ ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆయన తెలియజేశాడు.

Also Read:Bimbisara Collections: ‘బింబిసార’ 12th డే కలెక్షన్స్.. బిగ్గెస్ట్ హిట్.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు

Tags