Nuclear War: మూడో ప్రపంచ యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి? మానవాళి మనుగడ ఏమవుతుంది? ప్రపంచమే తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుంది. దీంతో మనుషుల మనుగడ ప్రశ్నార్థకంలో పడనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో కూడా చాలా నష్టమే కలగనుంది. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం ఆసన్నమైతే జరిగే దుష్ఫరిణామాలపై యావత్తు ప్రపంచమే ఆలోచనలో పడిపోతోంది. ఈ క్రమంలో యుద్ధం వస్తే అణ్వాయుధాలు ప్రయోగించుకోవడమే లక్ష్యంగా ఉంటుంది. దీంతో ప్రపంచం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితి. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వేసిన బాంబులకు జపాన్ ఇంకా బారీ మూల్యమే చెల్లిస్తోంది.
ఒకవేళ అణుయుద్ధమే జరిగితే 5 బిలియన్ మంది మరణిస్తారని అంచనా వేస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఇక మానవాళి మనుగడ ప్రమాదంలో పడే అవకాశముంది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో చాలా దేశాలు నష్టపోతున్నాయి. పలు దేశాల్లో అతివృష్టి ఇంకా కొన్ని దేశాల్లో అనావృష్టి ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తే మానవాళికి తీవ్ర నష్టం కలగనుంది. తినడానికి తిండి కూడా దొరికే అవకాశం ఉండదని తెలుస్తోంది. దీనిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
Also Read: Rupee Journey: 75 ఏళ్ల స్వాతంత్య్రం.. 75 రూపాయలు పతనం.. రూ.4 నుంచి రూ.80 వరకు రూపాయి ప్రయాణం!
అణుయుద్ధం జరిగితే ఏర్పడే దుష్పరిణామాలపై అందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తే అణ్వాయుధాలు వినియోగించే ప్రమాదం పొంచి ఉంది. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే అణ్వాయుధాలు ప్రయోగింుకునే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే ఆకలితో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు మరింత నష్టం కలగనుంది. దీనిపై అందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం వద్దంటూ హెచ్చరికలు వస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు యుద్ధం వద్దనే సూచిస్తున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏర్పడే దుష్పరిణామాలపై సమగ్ర అధ్యయనం జరుగుతోంది. అణ్వాయుధాల వాడకం వల్ల ప్రజలకు నష్టం భారీగానే ఉండనుంది. అందుకే మూడో ప్రపంచ యుద్ధం వద్దంటూ చెబుతున్నారు. అణ్వాయుధాల ప్రయోగంతో అందరికి నష్టమే కలగనుంది. భారీగా అణ్వాయుధాలు ప్రయోగిస్తే నేలలు పాడైపోతాయి. ఫలితంగా కొన్నేళ్ల పాటు ఆహారం దొరకని పరిస్థితి. దీంతో ప్రపంచ యుద్ధం రాకూడదనే వాదన అందరిలో వస్తోంది.