Homeఎంటర్టైన్మెంట్Rao Bahadur Trailer Review: రావు బహదూర్ ట్రైలర్ రివ్యూ : మ్యాటర్ ఉంది.. అందుకే...

Rao Bahadur Trailer Review: రావు బహదూర్ ట్రైలర్ రివ్యూ : మ్యాటర్ ఉంది.. అందుకే మహేష్ మార్క్.. అదొక్కటే లోపం

Rao Bahadur Trailer Review: డిఫరెంట్ సినిమాలను చేస్తు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకునే ప్రయత్నంలో సత్యదేవ్ చాలా బిజీగా ఉన్నాడు. ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నప్పటికి ప్రేక్షకుల నుంచి తనకి రావాల్సిన ఆదరణ రావడం లేదు. ఎందుకని అలా జరుగుతుంది అనేది క్లారిటిగా తెలియదు. కానీ మొత్తానికైతే ఆయన ఇప్పుడు ‘రావు బహదూర్’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ఉండటంవల్ల మూవీ చూసే ప్రేక్షకులందరికి చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇక దానికి తోడుగా ఈ సినిమా ట్రైలర్ ని కనక మనం అబ్సర్వ్ చేసినట్లయితే కంటెంట్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సత్యదేవ్ క్యారెక్టర్ చుట్టూనే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో వచ్చిన డైలాగ్ తోనే ఈ సినిమా కంటెంట్ మొత్తాన్ని చెప్పేశారా? అన్నట్టుగా అర్థమవుతుంది. సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ‘మ్యాజిక్ అంటే గారడి కాదు దృశ్య కావ్యం’ అంటూ మహేష్ బాబు చెప్పిన ఆ ఒక్క మాట సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అంచనాలను పెంచేస్తుంది.

సత్యదేవ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించినట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజుల్లో చనిపోతాడు అని చెప్పిన మనిషి కొన్ని సంవత్సరాల పాటు ఎలా బతికాడు తన సర్వైవల్ కి గల కారణం ఏంటి అనేది ఈ సినిమాలోని కోర్ పాయింట్ గా తెలుస్తుంది. ఇక ఆయన ఎందుకని అన్ని సంవత్సరాల పాటు బతికున్నాడు.

ఆయన చేయాల్సిన కార్యం ఏదైనా ఉందా లేదంటే ఇంకేదైనా పాయింట్ ను బలంగా చెప్పబోతున్నారా? సినిమా మొత్తం ఒక డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక దాదాపు ఒక కోటలోనే ఈ సినిమా మొత్తాన్ని తీసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సినిమా కంటెంట్ రాజుల కాలం నుంచి ఇప్పటి జనరేషన్ కి కనెక్ట్ చేశారు. అది ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తుందనేది ఇదే ఈ మూవీకి మైనస్ కాబోతుందా అనేది తెలియాల్సి ఉంది…

సత్యదేవ్ యాక్టింగ్ లో కొత్త మెలుకువలు చూపించబోతున్నాడా అనే విషయం కూడా చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాని మహేష్ బాబు నిర్మించడం ఒకెత్తయితే ఆయన ఈ సినిమా ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా అమాంతం ఈ సినిమా మీద అంచనాలను పెంచేసింది…

 

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular