Rao Bahadur 4 Days Collection: రీసెంట్ సమయం లో ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ కి మెంటలెక్కిపోయేలా చేసిన చిత్రాల్లో ఒకటి ‘రావు బహదూర్’. సత్యదేవ్ హీరో గా , వెంకటేష్ మహా దర్శకత్వం లో , సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకొచ్చి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. కానీ మొదటి నుండి మంచి క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఓపెనింగ్ వసూళ్లు డీసెంట్ గా వచ్చాయి. మొదటి వీకెండ్ వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. ఇక నాల్గవ రోజున తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , ఓవరాల్ వరల్డ్ వైడ్ 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 4 రోజుల్లో ఎంతో గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి ఊహించినదానికంటే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. మొదటి నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రానికి 2 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 2 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రల నుండి ఈ చిత్రానికి 4 కోట్ల 65 లక్షలు గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 90 లక్షల రూపాయిల గ్రాస్, ఓవర్సీస్ నుండి 3 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 9 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 4 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
మేకర్స్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 8 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. అన్ని ప్రాంతాల్లోనూ అడ్వాన్స్ బేసిస్ మీదనే ఈ చిత్రం విడుదలైంది. ఈ కారణం చేత బయ్యర్స్ కి కలిగే నష్టం ఏమి లేదు , కానీ నిర్మాత పెట్టిన బడ్జెట్ తో సహా మొత్తం రీకవర్ అవ్వాలంటే 8 కోట్ల 50 లక్షల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను రాబట్టాలి. ఎంత వసూళ్లు రాబట్టిన ఈ రెండు రోజుల్లోనే రాబట్టాలి , ఆ తర్వాత ‘లెనిన్’ వంటి చిత్రం వస్తుంది , థియేటర్స్ మొత్తం ఆ చిత్రానికే వెళ్లిపోతాయి , కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యమే.
