Rare Video: బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు పొందిన హీరో రన్వీర్ సింగ్… తన ఎంటైర్ సినిమా కెరియర్ లో ఎన్నో రోల్స్ ని చేసి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్న నటుడు కూడా రన్వీర్ సింగ్ కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే రన్వీర్ సింగ్ ఇండస్ట్రీలోకి రాకముందు యాక్టింగ్ నేర్చుకోవడానికి ‘దాదాసాహెబ్ ఫాల్కే ఇన్స్టిట్యూట్’ లో శిక్షణ తీసుకున్నాడు.
నిజానికి ఆయనను మంచి నటుడుగా తీర్చిదిద్దింది కూడా ఆ ఇన్స్టిట్యూట్ అని రణ్వీర్ ఇప్పటికీ చాలాసార్లు చెప్పడం విశేషం…ఇక ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ అయిపోయిన తరువాత ఆయన ఆడిషన్ ఇస్తున్నప్పుడు తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రన్వీర్ సింగ్ ను చూస్తే మనం అసలు గుర్తుపట్టలేము. చాలా సన్నగా, నూనూగు మీసాలతో ఉన్నాడు. ఇక ఆ ఆడిషన్ లో ఆయన ఒక స్టెప్ డాన్స్ వేస్తున్నట్టుగా చేస్తూ అందర్నీ నవ్విస్తూ ఉండడం విశేషము. ఇక ఇదిలా ఉంటే ఆయన ఇన్స్టిట్యూట్ ముగిసిన తర్వాత చాలా సినిమా ఆఫీస్ లకి వెళ్లి ఆడిషన్స్ ఇచ్చానని ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.
అయినప్పటికీ చాలామంది అతన్ని రిజెక్ట్ చేశారట. అయిన కూడా పట్టువదలని విక్రమార్కుడిలా ఆడిషన్స్ ఇస్తూనే వచ్చాడు. ఇక మొత్తానికైతే ఆయన ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఆయన కెరియర్లో రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ లు ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఆయన చేసే పాత్రలు ఒక కేటగిరి అభిమానులను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి.
అందువల్లే రన్వీర్ సింగ్ సినిమాలు చూడడానికి ప్రేక్షకులందరూ అమితమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నా రన్వీర్ సింగ్ మరోసారి భారీ సక్సెస్ ని అందుకోవడానికి రెడీ అవుతున్నాడు….ఇక ఆయన శంకర్ తో చేయాలనుకున్న ‘అపరిచితుడు ‘ రీమేక్ ప్రాజెక్ట్ క్యాన్సల్ అయినట్టుగా అనౌన్స్ చేశారు…ఇక మరోసారి సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లోనే సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది..