https://oktelugu.com/

Lakshmi Manchu: రామ్ చరణ్, రానా, అల్లు అర్జున్ లా వాట్సాప్ సీక్రెట్స్ చెప్పిన లక్ష్మి మంచు…

Lakshmi Manchu: అల్లు అర్జున్ లాంటి హీరో సైతం తనకి ఏదైనా ట్రైలర్ నచ్చితే దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడని చెప్పింది. అలాగే రామ్ చరణ్, రానా లాంటి హీరోలతో తనకు చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని...

Written By:
  • Gopi
  • , Updated On : July 4, 2024 / 09:51 AM IST

    Lakshmi Manchu told WhatsApp secrets like Ram Charan, Rana, Allu Arjun

    Follow us on

    Lakshmi Manchu: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులందరూ సినిమాల పరంగా పోటీ పెట్టుకున్నప్పటికీ వాళ్ళ పర్సనల్ జీవితాల్లో మాత్రం మంచి ఫ్రెండ్స్ గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే.. ఎందుకంటే పబ్లిక్ లో వాళ్ల ఫ్రెండ్షిప్ గురించి చాలాసార్లు చెప్పారు. నిజంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య అయితే మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి త్రిబుల్ ఆర్ సినిమా కూడా చేయడం విశేషం.

    అలాగే మహేష్ బాబు ఎన్టీఆర్, రామ్ చరణ్ మహేష్ బాబు ల మధ్య కూడా మంచి స్నేహపూర్వకమైన బంధాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి కూడా అందరి హీరోలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. ఇక ఇలాంటి సమయంలోనే మంచు లక్ష్మి ప్రముఖ హోస్ట్ అయిన సిద్ధార్థ్ కన్నన్ తో మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో కలిసిన ఒక వాట్సాప్ గ్రూప్ ఉందని అందులో 142 మంది సెలబ్రిటీలు ఉన్నారని ఆమె చెప్పింది. అలాగే ఏదైనా సినిమాకు సంబంధించిన టీజర్ గాని , ట్రైలర్ గాని ఆ గ్రూపులో వేస్తూ ఉంటారని దాంతో అందరూ తరుచుగా వాటిని చూస్తూ ప్రమోట్ చేసే విధంగా ఆ గ్రూపును క్రియేట్ చేశామని తను వెల్లడించింది.

    ఇక అల్లు అర్జున్ లాంటి హీరో సైతం తనకి ఏదైనా ట్రైలర్ నచ్చితే దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాడని చెప్పింది. అలాగే రామ్ చరణ్, రానా లాంటి హీరోలతో తనకు చిన్నప్పటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మేమంతా కలిసి పెరిగామని సీక్రెట్స్ ని పంచుకుంది. అలాగే ప్రస్తుతం లక్ష్మీ మంచు బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసేందుకు ప్రయత్నాలను చేస్తుంది అందుకోసమే తను కొద్ది రోజుల నుంచి ముంబైలో ఉంటున్నట్టుగా కూడా తన వివరాలను తెలియజేసింది.

    ముంబైలో కొద్దిరోజుల పాటు రకుల్ ప్రీతిసింగ్ ఇంట్లోనే ఉన్నట్టుగా కూడా చెప్పింది. ఇక ఇదిలా ఉంటే తను బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేయడానికి రామ్ చరణ్, రానా చాలా వరకు హెల్ప్ చేశారని వాళ్ళ ఎంకరేజ్ మెంట్ తోనే తను బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్తున్నానని కూడా చెప్పింది. ఇక అలాగే రానా, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు తన తో తరుచుగా వాట్సాప్ లో చాట్ చేస్తారని చెప్పింది. ఇక మొత్తానికైతే తను ‘యక్షిణి ‘ అనే ఒక సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక దాంతో పాటుగా బాలీవుడ్ లో పలు సిరీస్ లు, సినిమాల్లో కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది…