https://oktelugu.com/

‘దుర్గమతి’ బాక్సాపీస్ వద్ద చేతులు ఎత్తేసింది !

స్వీటీ అనుష్క మెయిన్ రోల్ లో వచ్చిన ‘భాగమతి’ బాలీవుడ్ లో “దుర్గమతి”గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ భూమి పెడ్నేకర్ అనుష్క రోల్ లో నటించినా, అనుష్క రేంజ్ లో ఆమె నటించలేకపోయింది. `భాగ‌మ‌తి` తీసిన అశోక్ నే ఈ సినిమాకి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా.. ‘భాగమతి’లో ఉన్నంత సస్పెన్న్ ఈ సినిమాలో మిస్ అయింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ తెర‌కెక్కించి.. భారీ స్థాయిలో హిందీలో `దుర్గామ‌తి`గా రీమేక్ […]

Written By:
  • admin
  • , Updated On : December 13, 2020 / 01:36 PM IST
    Follow us on


    స్వీటీ అనుష్క మెయిన్ రోల్ లో వచ్చిన ‘భాగమతి’ బాలీవుడ్ లో “దుర్గమతి”గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ భూమి పెడ్నేకర్ అనుష్క రోల్ లో నటించినా, అనుష్క రేంజ్ లో ఆమె నటించలేకపోయింది. `భాగ‌మ‌తి` తీసిన అశోక్ నే ఈ సినిమాకి కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా.. ‘భాగమతి’లో ఉన్నంత సస్పెన్న్ ఈ సినిమాలో మిస్ అయింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ తెర‌కెక్కించి.. భారీ స్థాయిలో హిందీలో `దుర్గామ‌తి`గా రీమేక్ చేసినా అక్కడి ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయారు. మొత్తానికి ఓటీటీ వేదిక‌గా విడుద‌లై.. ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకుంది ఈ సినిమా.

    Also Read: నారప్పగా వెంకీ అదరగొట్టాడు !

    మెయిన్ గా ఈ సినిమాలో క్యాస్టింగ్ లోపమే ఎక్కువగా ఉంది. దీనికితోడు కొంతమంది నటుల నుంచి దారుణమైన పెర్ఫామెన్స్ కూడా అవుట్ ఫుట్ ను దెబ్బ తీసింది. ముఖ్యంగా తెలుగులో ధన్ రాజ్ చేసిన కానిస్టేబుల్ రోల్ హిందీలో చేసిన నటుడు వరెస్ట్ గా చేశాడు. అలాగే మెయిన్ విలన్ గా నటించిన నటుడు నటన కూడా అసలు బాలేదు. అలాగే ఈశ్వర్ ప్రసాద్ పై డిజైన్ చేసిన కథాంశం కూడా అసలు పొంతన లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనితో అతని రోల్ అసలు ఆసక్తికరంగా సాగినట్టే అనిపించదు. మరి మరో పెద్ద డ్రా బ్యాక్ ఏంటంటే మెయిన్ లీడ్ అయినటువంటి భూమి పెడ్నేకర్ నుంచి సరైన పెర్ఫామెన్స్ ను రాబట్టలేకపోయారు.

    Also Read: నిహారికను అలా చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాగబాబు

    ఇక తెలుగు ఆడియెన్స్ కు ఈ సినిమా ఏ మాత్రం నచ్చదు. అయినా ఒక రీమేక్ సినిమా అంటే ఖచ్చితంగా పెర్ఫామెన్స్ లు అవుట్ స్టాండింగ్ గా ఉండాలి. ఈ సినిమాలో అవే లేవు. అలాగే కొన్ని సన్నివేశాలు అనవసర ప్రయత్నం అనిపిస్తుంది, అలాగే సస్పెన్స్ ఫ్యాక్టర్ ను కూడా అంత బాగా ఎలివేట్ చెయ్యలేదు. ఇవన్నీ చికాకు తెప్పించే అంశాలే. మొత్తానికి హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాగా నిలిచింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్