
దేశంలోనే దిగ్గజ దర్శకుడిగా శంకర్ కు పేరుంది. ఈ తమిళ దర్శకుడు ఇప్పుడు తన మకాంను తెలుగులోకి మార్చేశాడు. తమిళనాట భారీ బడ్జెట్ చిత్రాలు తీసి అక్కడి నిర్మాతలతో గొడవలు పెట్టుకొని కోర్టుల వరకూ సంసారం వెళ్లింది. దీంతో ఇక తమిళ నిర్మాతలను నమ్ముకోకుండా స్ట్రెయిట్ గా తెలుగు నిర్మాత, తెలుగు హీరోతో సినిమా మొదలుపెట్టాడు. మరీ ఈయన భారీతనాన్ని మనోళ్లు తట్టుకుంటారా? లేదా? అన్నది వేచిచూడాలి.
శంకర్ తాజాగా కమల్ హాసన్ తో కలిసి తీసిన ‘ఇండియన్2’ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమా పూర్తికాలేదు. ఇక ఈ సినిమా నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ తో దర్శకుడు శంకర్ కు విభేదాలు ఏర్పడ్డాయి.‘ఇండియన్2’ పూర్తి చేయకుండానే శంకర్ తెలుగులో రాంచరణ్ తో సినిమా ప్రకటించడంతో లైకా ప్రొడక్షన్ కోర్టుకు వెళ్లింది. తమ ‘ఇండియన్2’ పూర్తిచేయకుండా శంకర్ వేరొక సినిమా చేయడానికి వీల్లేదని వాదించింది.
ఈ క్రమంలోనే నిర్మాతలు దీన్ని రాజీ కుదిర్చారు. ఆ సినిమా ప్రస్తుతం పూర్తి చేసి శంకర్ ఇటు తెలుగులోకి వచ్చేస్తున్నారు. దిల్ రాజ్ నిర్మాణంలో భారీ బడ్జెట్ మూవీగా రాంచరణ్ తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలోనే తీయాలని శంకర్ డిసైడ్ అయ్యాడట.. ఈ మేరకు లోకేషన్లను వెతికి ఖాయం చేశాడని తెలిసింది.
ఈ సినిమాను సెప్టెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు శంకర్ రెడీ అయ్యారు. అసలు ఈ సినిమాకు లీగల్ సమస్యలతో మొదలవుతుందో లేదో అనుకుంటే ఏకంగా షూటింగ్ మొదలు కాబోతుండడం విశేషంగా మారింది.