20,000 మంది సేల్స్ ఎగ్జిక్యూటివ్ లను పేటీఎం సంస్థ నియమించుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎవరైతే ఎంపికవుతారో వాళ్లకు కమిషన్, జీతంతో కలిపి ఏకంగా 35వేల రూపాయలు లభించనుందని తెలుస్తోంది. పదో తరగతి లేదా పై చదువులు చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వాళ్లకు ఈ విధంగా ప్రయోజనం చేకూరనుంది.
పేటీఎం ఐపీవోకు వస్తున్న నేపథ్యంలో ఈ ఉద్యోగ ఖాళీల నియామకం జరగనుందని సమాచారం అందుతోంది. పేటీఎం ఐపీవో పరిణామం 16,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం. ఈ నియామకాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతున్న నేపథ్యంలో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.
పేటీఎం సంస్థ భారీగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధం కాగా ఇతర సంస్థలు కూడా రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.