
కరోనా మహమ్మారి వల్ల దేశంలోని లక్షల సంఖ్యలో ఉద్యోగులు నిరుద్యోగులయ్యారు. చిన్నా, మధ్య తరగతి వర్గాల ప్రజలు కరోనా వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో అనేక స్కీమ్ లను అమలు చేస్తోంది. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీమ్ పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.
ప్రజల్లో చాలామందికి ఈ స్కీమ్ గురించి కనీస అవగాహన కూడా లేదు. ఫుడ్ ఇండస్ట్రీలో రాణించాలని భావించే వాళ్లకు కేంద్రం ఈ స్కీమ్ ద్వారా సహాయం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో ఏకంగా 10వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ ఈ స్కీమ్ ను పర్యవేక్షిస్తుండగా వ్యాపారులు తమ వ్యాపారాన్ని సులువుగా పెంచుకునే అవకాశం ఉంటుంది.
కేంద్రం ఈ పథకం ద్వారా ఏకంగా 9 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందని 35 శాతం క్రెడిట్-లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ ద్వారా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందవచ్చని సమాచారం. ఈ స్కీమ్ ద్వారా గరిష్టంగా 10 లక్షల రూపాయలు పొందవచ్చు. ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందాలని అనుకుంటే https://pmfme.mofpi.gov.in/pmfme/#/login వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి.
ప్రతి జిల్లాలో రిసోర్స్ పర్సన్‌లను నియమించి వాళ్ల ద్వారా బ్యాంక్ నుండి రుణం తీసుకోవడం, ఇతర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుండటం గమనార్హం. దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రభుత్వం పరిశీలన జరిపి లబ్దిదారుడి ఖాతాలో నగదు జమ చేయనుంది.