Brahmastra OTT: బాలీవుడ్ నుంచి వచ్చిన భారీ యాక్షన్ మూవీ బ్రహ్మస్త్ర. ఈ మూవీని హీందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులోనూ మంచి టాక్ తెచ్చుకున్నా.. అనుకున్న సక్సెస్ కాలేదనే చెప్పాలి. అయితే బీ టౌన్లో మాత్రం కమర్షియల్ గా హిట్టు కొట్టింది. సెప్టెంబర్ 9న విడుదలయిన బ్రహ్మస్త్ర ఇప్పటి వరకు మంచి కలెక్షన్లు సాధించి 100 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోతుంది. అయితే ఓటీటీ ఈ మూవీ ఎప్పుడూ రిలీజ్ అని ఇంతకాలం ఎదురుచూశారు. ఇలాంటి వారికి ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే తేదిని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రపంచంలో అనేక అస్త్రాలను సృష్టించిన బ్రహ్మదేవుడు తన పేరిట కూడా ఓ అస్త్రాన్ని సృష్టిస్తాడు. అయితే ఇది దుర్మార్గుల చేతికి వెళ్తే భూగోళం సర్వనాశనం అవుతుంది. దీనిని రక్షించే బాధ్యతను బ్రహ్మన్ష్ కుటుంబ సభ్యులపై ఉంటుంది. వీరిలో ఒకరైన మోహన్ భార్గవ వద్ద బ్రహ్మస్త్రలోని ఒక భాగం ఉందనే విషయాన్ని తెలుసుకున్న జునూన్ అతనిపై దాడి చేసి ఒక భాగాన్ని హరిస్తుంది. మరోభాగం అనీశ్ శెట్టి దగ్గర ఉంటుంది. దానిని తెలుసుకోవడానికి మౌనిరాయ్ వారణాసి వెళ్తుంది. ఈమధ్యలో శివ పరిచయం అవుతాడు. అతనికి అనీశ్ శెట్టి, మోహన్ భార్గవ్ లను హత్య చేసిన ఒక బృందం తనను కూడా హత్యకు యత్నిస్తారని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో జరిగే కథాంశం ఆకట్టుకుంటుంది.
భారీ విజువల్ ఎఫెక్ట్ తో వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించారు. కానీ మిగతా సినిమాల పోటీకి తట్టుకోలేకపోయింది. దీంతో కొన్ని ఏరియాల్లో దూసుకుపోతున్నా.. తెలుగులో మాత్రం కొద్దిరోజులే ఆడింది. బ్రహ్మస్త్రను మొత్తం మూడు భాగాలుగా తీయనున్నారు. మొదటిభాగం అల్రెడీ వచ్చినందున మరో రెండు భాగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీని 3డీ, ఐమాక్స్ 3డీ వెర్షన్లలో నూ తీయనున్నారు. దీంతో ఈ మూవీపై మరింత ఇంట్రెస్టీ పెరిగి కొందరు ఓటీటీ వేదికగా చూడాలని కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో చిత్రం యూనిట్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదికగా నవంబర్ 4న బ్రహ్మస్తను అందుబాటులోకి తేనున్నారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన చేయకున్నా.. దాదాపు ఈ తేదీనే ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. సో .. ఇక బ్రహ్మస్త్రను ఓటీటీ వేదికగా వీక్షించేందుకు రెడీగా ఉండాలని కొందరు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.