Balakrishna Fan: అభిమానుల చర్యలు కొన్ని సందర్భాల్లో పరిధులు దాటేస్తుంటాయి. కొందరైతే తమ హీరో కోసం ప్రాణాలు ఇవ్వడానికి తీయడానికి కూడా వెనకాడరు. అలాంటి సంఘటనే తాజాగా చోటు చేసుకుంది. బాలకృష్ణ అభిమాని ఒకరు పెద్ద సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా తన ప్రాణాలే పణంగా పెట్టాడు. విషయంలోకి వెళితే బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో బాధితులను పరామర్శించేందుకు బాలయ్య అక్కడకు వెళ్ళాడు. ప్రస్తుతం ఆయన హిందూపురం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

ఇక బాలయ్య రాకను తెలుసుకున్న అభిమానులు చూసేందుకు, కలిసేందుకు ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో ఒక అభిమాని అత్యుత్సాహం చూపించాడు. వరద ప్రభావానికి స్థానికంగా ఉన్న కాలువ వంతెన కొట్టుకుపోయింది. దీంతో కాలువ అవతల ఉన్న వారు బాలయ్యను కలవడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. ఒక అభిమాని మాత్రం బాలయ్యను ఎలాగైనా చూడాలని ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువ దాటే ప్రయత్నం చేశాడు. వరద దాటికి అతడు కొట్టుకుపోయాడు.
అదృష్టం కొద్ది స్థానికులు అతన్ని కాపాడి బయటకు తీశారు. సకాలంలో స్పందించకపోతే బాలయ్య అభిమాని వరదలో మునిగి ప్రాణాలు కోల్పోయేవాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరోలపై అభిమానం ఉండాలి కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునేంత పిచ్చి అభిమానం ఉండకూడని సంఘటన నేపథ్యంలో పలువురు హితవు పలుకుతున్నారు. అదే సమయంలో ప్రాణాలతో బయటపడినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అఖండ మూవీతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు బాలయ్య. అఖండ ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రూ. 120 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఆ ఊపులో తన 107వ చిత్రాన్ని చకచకా పూర్తి చేశాడు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు.
https://twitter.com/SweetyChittine1/status/1582274123530899456?s=20&t=5Gc-mMbe5rjsGsU86DvKXQ