Homeఎంటర్టైన్మెంట్Actor Rana: ఏం టైమ్ పాస్ గాళ్ళు బ్రో మీరూ అంటూ మీమ్ మేకర్ పై...

Actor Rana: ఏం టైమ్ పాస్ గాళ్ళు బ్రో మీరూ అంటూ మీమ్ మేకర్ పై ఫైర్ అయిన రానా…

Actor Rana: ప్రముఖ హీరో దగ్గుబాటి రానా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. లీడర్ సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో… బాహుబలితో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. పలు ఇంటర్వ్యూ ల లోనూ సమావేశాల్లోనూ మంచి సెన్సాఫ్ హ్యూమర్ తో పలు ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉంటాడు రానా. వేణు ఊడుగుల దర్శకత్వంలో ” విరాటపర్వం” అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి. విరాట పర్వంలో రానా నక్సలైట్‌గా కనిపించనుండగా… సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

rana fires on meme maker for making false news on his virataparvam movie

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ మీమ్ మేకర్ ‘లాంగ్వేజ్ ఇష్యూ కారణంగా ‘విరాటపర్వం’ సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల కాబోతోంది’ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. అది రానా దృష్టిలో పడటంతో అతను దానికి సరదాగా రిప్లయ్ ఇచ్చాడు. ‘ఈ లాంగ్వేజ్ ఇష్యూ అంటే ఏమిటో నాకు కాస్తంత జ్ఞానోదయం చేయండి… ఏం టైమ్ పాస్ గాళ్ళు బ్రో మీరూ అంటూ నవ్వుతున్న ఎమోజీలను కామెంట్ చేశాడు. తన సినిమా గురించి చేసిన వ్యాఖ్యలను సరదాగా తీసుకుని, తిరిగి అంతే సరదాగా రిప్లయ్ ఇచ్చినందుకు రానాను అభినందిస్తున్నారు. ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా బిజీబిజీగా గడిపేసిన రానాను ‘ఎందుకలా?’ అని అడిగితే, ‘ఖాళీగా ఉంటే మా నాన్న ఊరుకోడు’ అంటూ సెటర్స్ వేసే వాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని వుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version