Etela Rajender: హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమి చెందడంతో టీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైంది. తమ పార్టీకి ఎదురు లేదని చెప్పే నేతలు ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నలు వస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి బీజేపీపై విమర్శలకు దిగడం చూస్తుంటే తెలంగాణలో బీజేపీ ప్రభావం క్రమంగా పెరగుతుందని తెలుస్తోంది. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ పై ఒక సీఎం విమర్శలకు దిగడం సంచలనం సృష్టిస్తోంది.
దేశంలో బీజేపీపై ఇక పోరాటం చేస్తామని చెప్పడం ఆయన తెలివి తక్కువ తనానికి నిదర్శనమని చెబుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే. కానీ ఒక సీఎం అయి ఉండి రాష్ర్ట అధ్యక్షుడిపై విమర్శలు చేయడం ఇప్పుడే చూస్తున్నాం. ఆయనలో సహనం తగ్గిపోతోంది. విమర్శలకు జడవని సీఎంగా పేరున్నా ఇటీవల కాలంలో చిన్న విషయాలకు సైతం తనలోని కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా చులకన అయిపోతున్నారు.
బీజేపీ బలం క్రమంగా పెరుగుతోంది. రాష్ర్టంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని ప్రకటిస్తున్న బీజేపీ నేతలకు కొద్ది రోజులుగా ఫలితాలు కూడా అదే స్థాయిలో రావడం చూస్తుంటే బీజేపీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగి అధికారం సాధించడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడారు.
Also Read: Telangana: అన్నదాతను ఆగం చేస్తున్న ఆ రెండు పార్టీలు..
దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాషాయ జెండాయే ఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. టీఆర్ఎస్ పాలనకు నూకలు చెల్లాయని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు మతి భ్రమిస్తోందని అన్నారు. దీంతోనే టీఆర్ఎస్ నేతల్లో తారా స్థాయికి చేరుతోంది. బీజేపీపై పోరాటం చేస్తామని చెబుతున్నా అది అంత సులువు కాదనే విషయం తెలుస్తోంది. బీజేపీతోనే పనులు చేయించుకుంటూ దానిమీదే ఆరోపణలు చేయడం సరైంది కాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ కు మతి చలిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Kaushik Reddy: కౌశిక్ రెడ్డి రాకతోనే టీఆర్ఎస్ కు నష్టం కలిగిందా?