Homeఎంటర్టైన్మెంట్Rana Daggubati: సమంత ఒకప్పుడు నాకు మరదలు..ఇప్పుడు చెల్లి' అంటూ రానా దగ్గుబాటి షాకింగ్ కామెంట్స్..వైరల్...

Rana Daggubati: సమంత ఒకప్పుడు నాకు మరదలు..ఇప్పుడు చెల్లి’ అంటూ రానా దగ్గుబాటి షాకింగ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!

Rana Daggubati :  కొద్దిరోజుల క్రితం అబుదాబిలో జరిగిన IIFA అవార్డ్స్ ఈవెంట్ కి రానా డబ్బుబాటి, తేజ సజ్జ చేసిన హోస్టింగ్ ఇప్పుడు ఎన్నో వివాదాలకు దారి తీసింది. నవంబర్ 3వ తేదీన జెమినీ టీవీ లో ప్రసారమైన ఈ ఈవెంట్ ని, రీసెంట్ గానే యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. IIFA ఈవెంట్ కాన్సెప్ట్ లో భాగంగా హోస్టింగ్ చేసేవాళ్ళు ఇండస్ట్రీ లో ఉన్న హీరోలపై సెటైర్లు వేయాలి. గతం లో రానా, నాని ఇలా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ, హీరోలు, హీరోయిన్లు మీద సెటైర్లు వేస్తూ సరదాగా ఈవెంట్ ని హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే తరహా హోస్టింగ్ ని ఈసారి రానా, తేజ సజ్జ చేశారు. మిగిలిన హీరోల అభిమానులు ఫన్ గానే తీసుకున్నారు కానీ, మహేష్ బాబు అభిమానులు మాత్రం చాలా సీరియస్ అయ్యారు. తమ హీరో కి క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ సోషల్ మీడియా లో రానా, తేజ సజ్జని ట్యాగ్ చేసి డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రానా సమంత తో వేసిన జోక్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే సమంత కి ‘వుమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుని అందుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఆడవాళ్లను ఉద్దేశిస్తూ చాలా ఎమోషనల్ గా ప్రసంగిస్తుంది. ప్రసంగం పూర్తి అయ్యాక రానా ఆమెని పిలుస్తాడు. అప్పుడు సమంత ‘ఇప్పుడే ఎమోషనల్ గా ఒక స్పీచ్ ఇచ్చాను..నాతో కామెడీ చేయకు’ అని అంటుంది. ఆ తర్వాత రానా సమంత వద్దకు వచ్చి ‘సమంత ఎక్కడో టాలీవుడ్ నుండి వచ్చి, ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్ళింది. ఒకప్పుడు నా మరదలు నుండి, ఇప్పుడు నా చెల్లిగా మారిపోయింది’ అని అంటాడు. అప్పుడు సమంత నవ్వుతూ ‘సెల్ఫ్ ట్రోలింగ్ కూడా చేస్తున్నావా’ అని అంటుంది. తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు నువ్వు అని రానా సమంత ని అడగగా, మరి నువ్వు చేస్తున్నావా? అని సమంత బదులిస్తుంది. దానికి రానా నన్ను తెలుగులో ఎవ్వరూ తీసుకోవడం లేదు అంటాడు. అప్పుడు సమంత నా పరిస్థితి కూడా అంతే అని చెప్తుంది.

ఇప్పుడు నేనొక సినిమా చేస్తే ‘నరసింహ నాయుడు’ లాగా ఉండాలి కానీ, ‘రానా నాయుడు’ లాగా ఉండకూడదు కదా అని అంటుంది సమంత. దానికి రానా బదులిస్తూ ‘అది సినిమా కాదు అక్క..షో..షోలో ఏదైనా చేసుకోవచ్చు అని మీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చూసి నేర్చుకున్నాం’ అని అంటాడు.అలా వీళ్లిద్దరి మధ్య సరదాగా సాగిన ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఆ తర్వాత తేజ సజ్జ సమంత తో మాట్లాడుతూ ‘మా ఇద్దరి హోస్టింగ్ ఎలా ఉంది’ అని అడగగా, సమంత ‘ఎబోవ్ యావరేజ్’ గా ఉంది అంటుంది. అప్పుడు రానా ‘సరే కిందకి వెళ్ళుపో’ అని అంటాడు. ఈ ఫన్నీ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇది ఇలా ఉండగా ఈమె నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ నేటి నుండి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version