Increase Mobile Lifetime: నేటి కాలంలో మొబైల్ లేకుండా ఏ పని ముందుకు సాగదు. ప్రతి పని కోసం ఫోన్ తప్పనిసరిగా మారింది. చిన్న చిన్న అవసరాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు పంపించుకోవడానికి ఫోన్ ను యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ పై అధిక భారం పడుతోంది. ఫోన్ పై భారం పడడంతో పాటు హ్యాకింగ్ కు కూడా గురవుతున్న సంఘటనలు చూస్తున్నాం. దీంతో మొబైల్ చాలా స్లోగా మారుతుంది. అంతేకాకుండా ఒక్కోసారి మనకు తెలియకుండా కొన్ని Mallware ఫోన్ లోకి చొరబడి ఫోన్ ను పాడు చేస్తాయి. వీటి నుంచి తప్పంచుకోండానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి విలువైన మొబైల్ ను కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చిన్న పని చేయాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ లైఫ్ టైమ్ ఆటోమేటిక్ గా పెరుగుతుందని కొందరు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పని ఏంటి? ఎలా ఫోన్ లైఫ్ టైఫ్ పెరుగుతుంది? ఆ వివరాల్లోకి వెళితే..
12th ఫెయిల్ సినిమాలో ఒక డైలాగ్ యూత్ ను బాగా ఆకర్షించింది. అదే Restart. ఒకసారి ఫెయిల్ అయినంత మాత్రాన మళ్లీ ప్రయత్నించడానికి ఈ పదాన్ని ఉపయోగించాలని అందులో చెబుతూ ఉంటారు. అయితే Restart అనే పదం ఫోన్ సేఫ్ గా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పడు కీ ఫ్యాడ్ ఫోన్ స్ట్రక్ అయితే Restart చేసేవాళ్లు. కానీ స్మార్ట్ మొబైల్ వచ్చాక ఆ అవసరం లేకుండా పోయింది. కానీ రెగ్యులర్ గా మొబైల్ ను Restart చేయడాలని అంటున్నారు. ఎందుకంటే?
National Security Agency (NSA) ప్రకారం మొబైల్ ను వారానికి ఒక్కసారైనా Restart చేయాలి అని అంటున్నారు. అదేంటి? రిస్టార్ట్ చేయడం వల్ల మొబైల్ లైఫ్ టైమ్ ఎలా పెరుగుతుంది? అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. మొబైల్ ను Restart చేయడం వల్ల సైబర్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు. Restart చేయడం వల్ల కొందరు హ్యాకర్స్ ఫోన్ గురించి తెలుసుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది. రెగ్యులర్ గా Restart చేయడం వల్ల బ్యాగ్రౌండ్ లో ఉన్న యాప్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. దీంతో ఫోన్ మెమోరి తగ్గుతుంది.
చాలా మంది మొబైల్ స్లోగా మూవ్ అవుతుందని అంటుంటారు. అటువంటి వారు Restart చేయడం వల్ల తమ మొబైల్ ను ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఫోన్ ను ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కొన్ని సార్లు హీట్ అవుతుంది. అయితే Restart చేయడం వల్ల ఫోన్ కూల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొబైల్ లో Network సమస్య ఎదుర్కొనేవాళ్లు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారు తమ మొబైల్ ను
Restart చేసి చూడండి… సమస్య పరిష్కారం అవుతుంది. అందువల్ల మొబైల్ ను రెగ్యులర్ గా Restart చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఫోన్ లైఫ్ టైమ్ పెరుగుతుంది. అంతేకాకుండా ఫోన్ యాప్స్ ఎప్పటిక్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మొబైల్ సేఫ్ గా ఉంటుంది.