https://oktelugu.com/

Pawan Kalyan: అమిత్ షాతో పవన్ భేటి వెనుక కథేంటి? ఎవరిపై ఫిర్యాదు చేశారు? యాక్షన్ షురూ అయినట్టేనా?

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక చర్చలు జరిపారు.ఇటీవల జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు.ఆయన అభిప్రాయాలను తీసుకున్నారు. కొన్నింటి విషయంలో అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 7, 2024 11:16 am

    Pawan Kalyan(34)

    Follow us on

    Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు ఢిల్లీ వెళ్ళినట్టు? ఆకస్మికంగా హోంమంత్రి అమిత్ షాను ఎందుకు కలిసినట్టు? పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇటీవల చాలా రకాల రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తోంది. దీనిపైనే మాట్లాడారు పవన్. పోలీస్ శాఖ పనితీరు మెరుగుపడాలని.. ఇలానే కొనసాగితే తాను హోం మంత్రి పదవి తీసుకోవాల్సి ఉంటుందని తీవ్రస్థాయిలో హెచ్చరికలు పంపారు. దీనిపై రచ్చ నడుస్తుండగానే కొందరుపోలీస్ అధికారులు, సిబ్బంది తీరు అనుమానాస్పదంగా ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడుతున్న వైసిపి యాక్టివిస్టులను అరెస్టు చేస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ నేరుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిశారు. డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు పవన్. కానీ సాదాసీదాగా వెళ్లి కేంద్ర హోం మంత్రితో చర్చలు జరిపారు. తరువాత ఎవ్వరినీ కలవకుండా తిరిగి విజయవాడ చేరుకున్నారు. దీంతో రకరకాల చర్చ నడుస్తోంది.

     * కూటమిపై ఫిర్యాదు కోసమేనా?
    కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు కోసమే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారని వైసిపి అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయడంలో హోంశాఖ మంత్రి వైఫల్యం చెందారని పవన్ ఆరోపించినట్టుగా ప్రచారం నడుస్తోంది. కానీ పవన్ ఆవేదన వేరేలా ఉంది. ఇప్పటికీ వైసీపీ ఆలోచనలకు తగ్గట్టుగానే పోలీస్ అధికారులు నడుచుకుంటున్నారని.. అప్పటి మాదిరిగా సోషల్ మీడియా కీచకులకు వెనుకేసుకొస్తున్నారన్నది పవన్ ఆరోపణ. దానికోసం చర్చించేందుకే పవన్ ఢిల్లీ వెళ్లారని.. సోషల్ మీడియా కీచకులకు పై ఉక్కు పాదం మోపాలన్న ఆలోచనలతో ఉన్నారని.. అందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

    * దానికి అడ్డుకట్ట
    అయితే రాజకీయాలకు అతీతంగా సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై విపరీతమైన ప్రచారం నడుస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయాలని పవన్ భావిస్తున్నారు. ముఖ్యంగా అదే పనిగా రాజకీయ ప్రత్యర్థులను వెంటాడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన కూడా చట్టాలను ఉల్లంఘించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లుగా సమాచారం. పూర్తిగా రాజకీయ అంశాలపైనే పవన్ పర్యటన సాగిందని తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదులకు కాదని.. కూటమికి చెడ్డ పేరు వచ్చేలా పోలీస్ వ్యవస్థ మారిందని.. దానిలో మార్పు రావాల్సిందేనని పవన్ ఒక అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. అదే విషయాలను అమిత్ షా తో షేర్ చేసుకుని ఆయన అభిప్రాయాలను, అనుమతులను తీసుకున్నట్లు తెలుస్తోంది.