సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చిన రానా ‘అరణ్య’

కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గకముందే దేశవ్యాప్తంగా థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అక్టోబర్ 15నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయితే ప్రేక్షకుల వస్తారా? లేరా అన్న సందేహాల నడుమే థియేటర్లను ఓపెన్ చేస్తుండటం గమనార్హం. Also Read: ‘తుగ్లక్ దర్బార్’కు టాలెంటెడ్ బ్యూటీ దూరం ! కరోనా నిబంధనలను పాటిస్తూ 50శాతం అక్యుపెన్సీతో మాత్రమే ప్రస్తుతం థియేటర్లు నడుస్తున్నాయి. ఇలా చేస్తే […]

Written By: NARESH, Updated On : October 21, 2020 5:40 pm
Follow us on

కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గకముందే దేశవ్యాప్తంగా థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అక్టోబర్ 15నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేశాయి. దీంతో అన్ని రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయితే ప్రేక్షకుల వస్తారా? లేరా అన్న సందేహాల నడుమే థియేటర్లను ఓపెన్ చేస్తుండటం గమనార్హం.

Also Read: ‘తుగ్లక్ దర్బార్’కు టాలెంటెడ్ బ్యూటీ దూరం !

కరోనా నిబంధనలను పాటిస్తూ 50శాతం అక్యుపెన్సీతో మాత్రమే ప్రస్తుతం థియేటర్లు నడుస్తున్నాయి. ఇలా చేస్తే థియేటర్ల నిర్వహాణకు కూడా డబ్బులు రావని థియేటర్ల యజమానులు వాపోతున్నాయి. అయితే థియేటర్లు ముందు ఓపెన్ చేసి కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజు చేస్తే కొద్దిరోజుల్లో పరిస్థితులన్నీ చక్కబడుతాయని థియేటర్లు యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈనేపథ్యంలోనే థియేటర్ యాజమానులు నష్టపోతున్నప్పటికీ సినిమా హాళ్లు ఓపెన్ చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొన్ని థియేటర్లు మాత్రమే ఓపెన్ అయినట్లు తెలుస్తోంది. పరిస్థితులను బట్టి థియేటర్లు ఓపెన్ చేయాలని నిర్వాహాకులు భావిస్తున్నారు.

థియేటర్లు ఓపెన్ అయిన కొత్త సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కొందరు నిర్మాతలు ఆచితుచి వ్యవహరిస్తున్నారు. పెద్ద సినిమాలన్నీ కొంచెం ఆలస్యంగా అంటే సంక్రాంతికి సినిమాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ టీజర్ లోని హైలైట్స్ !

సంక్రాంతి రేసులో ఇప్పటికే ‘రంగ్ దే’.. ‘బ్యాచిలర్’.. ‘అల్లుడు అదుర్స్’.. ‘వకీల్ సాబ్’ మూవీలు ఉన్నాయి. తాజాగా రానా నటించిన ‘అరణ్య’ మూవీ సంక్రాంతికి రానుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ‘బాహుబలి’తో రానా వరల్డ్ వైడ్ గా క్రేజీ తెచ్చుకున్నాడు. బాహుబలిలో భళ్లలాదేవుడిగా అలరించిన రానా ‘అరణ్య’లో మావటివాడిగా అలరించేందుకు సిద్ధవుతున్నారు.

ఇప్పటికే ఈ మూవీ టీజర్.. ఫస్టు లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్లలో రిలీజైతే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంక్రాంతికి రిలీజు కానున్న ‘అరణ్య’ థియేటర్ల అరణ్యరోధనను ఈమేరకు తీరుస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!