https://oktelugu.com/

నిహారికను ఎప్పుడూ ఇలా చూడలేదట !

మెగా డాటర్ నిహారిక ఇప్పటివరకూ ఎక్స్‌పోజింగ్ కి దూరంగానే ఉంది. మొదటి సినిమాలో కాస్త ముద్దులు ఎక్కువైయ్యాయి అని మెగా అభిమానులు ఫీల్ అయ్యారు గానీ, బట్ నిహారిక మాత్రం తరువాత కొన్ని సినిమాల్లో కనిపించినా, బుల్లితెర పై సందడి చేసినా ఎక్కాడా గ్లామర్ హీరోయిన్ గా కనిపించలేదు. వెబ్ సిరీస్‌లు చేసినా సరే తన హద్దులు ఎప్పుడూ దాటకుండా పైగా ఎక్స్‌పోజింగ్ ఆమడ దూరంలో ఉంటూ పద్దతిగానే కనిపిస్తూ వచ్చింది. అప్పుడప్పుడు మోడ్రన్ డ్రెస్సులు వేసినా […]

Written By:
  • admin
  • , Updated On : October 21, 2020 / 05:33 PM IST
    Follow us on


    మెగా డాటర్ నిహారిక ఇప్పటివరకూ ఎక్స్‌పోజింగ్ కి దూరంగానే ఉంది. మొదటి సినిమాలో కాస్త ముద్దులు ఎక్కువైయ్యాయి అని మెగా అభిమానులు ఫీల్ అయ్యారు గానీ, బట్ నిహారిక మాత్రం తరువాత కొన్ని సినిమాల్లో కనిపించినా, బుల్లితెర పై సందడి చేసినా ఎక్కాడా గ్లామర్ హీరోయిన్ గా కనిపించలేదు. వెబ్ సిరీస్‌లు చేసినా సరే తన హద్దులు ఎప్పుడూ దాటకుండా పైగా ఎక్స్‌పోజింగ్ ఆమడ దూరంలో ఉంటూ పద్దతిగానే కనిపిస్తూ వచ్చింది. అప్పుడప్పుడు మోడ్రన్ డ్రెస్సులు వేసినా ఓవర్ కాకుండా జాగ్రత్తగానే మ్యానేజ్ చేసేది. అయితే ఈ మధ్య నిహారిక తన పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుండి తన పద్దతి మార్చుకునట్లు కనిపిస్తోంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ టీజర్ లోని హైలైట్స్ !

    రీసెంట్ గా గోవా పార్టీలో నిహారిక కొంత గ్లామర్ డోస్ పెంచింది. తాజాగా నిహారిక తన ఫియాన్సీ చైతన్యతో కలిసి బయటకు వెళ్లినట్టు కనిపిస్తోంది. అయితే నిహారిక మాత్రం అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది. అసలు నిహారికను ఇదవరకు ఎప్పుడూ ఇలాంటి హాట్ లుక్స్ లో చూడలేదు అని నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి తన ఇన్ స్టా స్టోరీలో చైతన్య పెట్టిన నిహారిక ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ జంట నిశ్చితార్థం తరువాత తరుచుగా కలుస్తోన్నట్లు ఉన్నారు. మధ్యలో బర్త్ డేలు వస్తే స్పెషల్ ట్రీట్‌లు కూడా ఇచ్చుకున్నారు. అలాగే కలిసి జిమ్‌ కు కూడా వెళ్తున్నారు.

    Also Read: కంగనాకు వార్నింగ్.. ‘నడిరోడ్డుపై రేప్ చేస్తా’..!

    ఇక డిసెంబర్‌లో నిహారిక పెళ్లి జరుగుతుందని పెళ్లి కార్యక్రమాలన్నీ వరుణ్ తేజ్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడని నాగబాబు ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి మెగా డాటర్ నిహారిక పెళ్లిని గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య తన వియ్యంకుడు ఐజీ రిటైర్మెంట్ సందర్భంగా అయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు నాగబాబు. ఇరు కుటుంబాల పెద్దలు కూడా కొద్దిరోజులుగా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.