https://oktelugu.com/

‘తుగ్లక్ దర్బార్’కు టాలెంటెడ్ బ్యూటీ దూరం !

ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితమే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి. అయినా ఇప్పటికీ అదే లుక్ తో అదే గ్లామర్ తో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కానీ తాజాగా ఓ సినిమా నుండి ఈ బ్యూటీ తప్పుకుంది. ఆ విషయాన్ని స్వయంగా అదితి రావు హైదరి తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన పోస్ట్ చేసింది. ఆమె మాటల్లో.. ‘విజయ్ సేతుపతి’ తుగ్లక్ దర్బార్ సినిమాలో నేను నటించట్లేదు. ఈ […]

Written By:
  • admin
  • , Updated On : October 21, 2020 / 04:46 PM IST
    Follow us on


    ఎప్పుడో పదిహేను ఏళ్ల క్రితమే హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది టాలెంటెడ్ బ్యూటీ అదితి రావు హైదరి. అయినా ఇప్పటికీ అదే లుక్ తో అదే గ్లామర్ తో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కానీ తాజాగా ఓ సినిమా నుండి ఈ బ్యూటీ తప్పుకుంది. ఆ విషయాన్ని స్వయంగా అదితి రావు హైదరి తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన పోస్ట్ చేసింది. ఆమె మాటల్లో.. ‘విజయ్ సేతుపతి’ తుగ్లక్ దర్బార్ సినిమాలో నేను నటించట్లేదు. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమతో సహా ప్రపంచం సినీ లోకమే గత 6-8 నెలలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశలవారీగా పనులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్స్ ను మొదలుపెట్టారు. ఇంకా అన్ని సినిమాల షూటింగ్ మొదలవ్వాలని కోరుకుంటున్నాను.

    Also Read: దారుణంగా బిగ్ బాస్ షో రేటింగ్స్.. షాక్ లో నిర్వాహకులు..?

    ఎందుకంటే పని లేక నటీనటులు ఎవ్వరూ వేచి ఉండకూడదు. ఇక నేను ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. అలాగే ప్రారంభించని ప్రాజెక్ట్‌ లు కూడా ఏ మాత్రం నా వల్ల ఆలస్యం కాకూడదు అని కొత్తగా వచ్చిన సినిమాలను కాదనుకుంటున్నాను. పైగా ఎక్కువ సమయం నేను పని చేయాలనుకుంటున్నాను. అయితే ప్రస్తుత కొన్నీ కారణాలను దృష్టిలో ఉంచుకుని, నిర్మాత, సెవెన్ స్క్రీన్ స్టూడియోకు చెందిన మిస్టర్ లలిత్ కుమార్ నిర్మాణంలో విజయ్ సేతుపతి హీరోగా దర్శకుడు డిల్లీ ప్రసాద్ దర్సకత్వంలో రానున్న ప్రాజెక్ట్ తుగ్లక్ దర్బార్ నుండి తప్పకుంటున్నాను.

    Also Read: తమిళ రాకర్స్ పైరసీ వైబ్ సైట్ ‘ఆట’కట్టించిన అమేజాన్

    దర్శకుడు డిల్లీ ప్రసాద్, విజయ్ సేతుపతి మరియు ‘తుగ్లక్ దర్బార్’ మొత్తం బృందంకు మంచి జరగాలని.. వారు చాల ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను చేయాల్సిన పాత్రను చేయబోతున్న ‘రాశి ఖన్నా’కు ఆల్ ది బెస్ట్. త్వరలో ఈ సినిమా ద్వారా మీ అందరినీ థియేటర్‌లో చూస్తాను. అప్పటి వరకు, సురక్షితంగా ఉండండి, జాగ్రత్త వహించండి” అంటూ అతిధి చెప్పుకొచ్చింది. మొత్తానికి విజయ్ సేతుపతి సినిమా నుండి అతిధి తప్పుకుంది. అయితే ఆమె తప్పుకోవడానికి ప్రధాన కారణం రెమ్యునరేషన్ అని తెలుస్తోంది.