Homeఎంటర్టైన్మెంట్ఈటీవీ నుండి ఓటీటీ.. రామోజీ ప్లాన్ అదిరింది !

ఈటీవీ నుండి ఓటీటీ.. రామోజీ ప్లాన్ అదిరింది !

Ramoji Raoఇది డిజిటల్ యుగం.. జనం అభిరుచి మారింది, థియేటర్లకు పోయి సినిమాలు చూడాలనే ఆసక్తి తగ్గింది. కారణం కరోనా అని సరిపుచ్చలేం. నిజానికి కరోనా రాకముందు నుండే చాలామంది పైరసీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించే వారు తప్ప, థియేటర్ వైపు తొంగి చూసేవారు కాదు. ఇక నుండి ఆ తొంగి చూపులు పూర్తిగా తగ్గేలా ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ తెలుగులో కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సంఖ్య పెరుగుతూ పోతూ ఉంది.

అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది జనంలో. సినిమా ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీస్ కి కూడా సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉంటే, అది అంత పెద్ద బలం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇదే బాటలో మరొక తెలుగు ఓటీటీ రానుంది. అదే ఈటీవీ ఓటీటీ. బుల్లితెర రంగంలో తిరుగులేని ప్రస్థానం ఈటీవీ సొంతం.

పైగా ఈటీవీ దగ్గర ఉండే డేటా చాలా ఎక్కువ. ఒక రకంగా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ కి లేని ఛాన్స్ ఈటీవీకి ఉంది. ఎందుకంటే ఈటీవీ వద్ద ఉన్నన్ని సినిమాలు ఏ ఛానెల్ దగ్గర లేవు. ముఖ్యంగా చాలావరకు పాత క్లాసికల్ సినిమాల హక్కులన్నీ ఈటీవీ వద్దనే ఉన్నాయి. ఆ సినిమాలను ఓటీటీలో ఉంచినా ప్రేక్షకులకు కొన్ని వందల సినిమాలు అందుబాటులోకి వస్తాయి.

అయితే ఓన్లీ ఆ సినిమాలనే ఓటీటీలో అప్ లోడ్ చేసి ఊరుకుంటే కుదరదు. అందుకే నాలుగు కొత్త వెబ్ సిరీస్ లను నిర్మించి, అధికారిక ఓటీటీ ప్లాట్ ఫామ్ అనే క్రెడిట్ ను కొట్టేయాలని రామోజీరావు ప్లాన్ చేస్తూ మొత్తానికి బాగా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. పైగా ఈటీవీకి గొప్ప క్రెడిబిలిటీ ఉంది. ఆ పేరు కూడా ఓటీటీకి బాగా ప్లస్ కానుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Oktelugu Epaper
Exit mobile version