https://oktelugu.com/

ఈటీవీ నుండి ఓటీటీ.. రామోజీ ప్లాన్ అదిరింది !

ఇది డిజిటల్ యుగం.. జనం అభిరుచి మారింది, థియేటర్లకు పోయి సినిమాలు చూడాలనే ఆసక్తి తగ్గింది. కారణం కరోనా అని సరిపుచ్చలేం. నిజానికి కరోనా రాకముందు నుండే చాలామంది పైరసీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించే వారు తప్ప, థియేటర్ వైపు తొంగి చూసేవారు కాదు. ఇక నుండి ఆ తొంగి చూపులు పూర్తిగా తగ్గేలా ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ తెలుగులో కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సంఖ్య పెరుగుతూ పోతూ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ […]

Written By:
  • admin
  • , Updated On : June 22, 2021 / 03:23 PM IST
    Follow us on

    ఇది డిజిటల్ యుగం.. జనం అభిరుచి మారింది, థియేటర్లకు పోయి సినిమాలు చూడాలనే ఆసక్తి తగ్గింది. కారణం కరోనా అని సరిపుచ్చలేం. నిజానికి కరోనా రాకముందు నుండే చాలామంది పైరసీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపించే వారు తప్ప, థియేటర్ వైపు తొంగి చూసేవారు కాదు. ఇక నుండి ఆ తొంగి చూపులు పూర్తిగా తగ్గేలా ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ తెలుగులో కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సంఖ్య పెరుగుతూ పోతూ ఉంది.

    అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి ఫుల్ క్రేజ్ ఉంది జనంలో. సినిమా ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీస్ కి కూడా సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉంటే, అది అంత పెద్ద బలం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇదే బాటలో మరొక తెలుగు ఓటీటీ రానుంది. అదే ఈటీవీ ఓటీటీ. బుల్లితెర రంగంలో తిరుగులేని ప్రస్థానం ఈటీవీ సొంతం.

    పైగా ఈటీవీ దగ్గర ఉండే డేటా చాలా ఎక్కువ. ఒక రకంగా ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ కి లేని ఛాన్స్ ఈటీవీకి ఉంది. ఎందుకంటే ఈటీవీ వద్ద ఉన్నన్ని సినిమాలు ఏ ఛానెల్ దగ్గర లేవు. ముఖ్యంగా చాలావరకు పాత క్లాసికల్ సినిమాల హక్కులన్నీ ఈటీవీ వద్దనే ఉన్నాయి. ఆ సినిమాలను ఓటీటీలో ఉంచినా ప్రేక్షకులకు కొన్ని వందల సినిమాలు అందుబాటులోకి వస్తాయి.

    అయితే ఓన్లీ ఆ సినిమాలనే ఓటీటీలో అప్ లోడ్ చేసి ఊరుకుంటే కుదరదు. అందుకే నాలుగు కొత్త వెబ్ సిరీస్ లను నిర్మించి, అధికారిక ఓటీటీ ప్లాట్ ఫామ్ అనే క్రెడిట్ ను కొట్టేయాలని రామోజీరావు ప్లాన్ చేస్తూ మొత్తానికి బాగా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. పైగా ఈటీవీకి గొప్ప క్రెడిబిలిటీ ఉంది. ఆ పేరు కూడా ఓటీటీకి బాగా ప్లస్ కానుంది.