మెగాస్టార్ తనయుడిగా రాంచరణ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘చిరుత’ మూవీతో గ్రాండ్ వెల్ కమ్ అందుకొని తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీరుడు’ సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి మెగా పవర్ స్టార్ గా రాంచరణ్ ఎదిగాడు.
Also Read: ‘మెగా’ బాంబ్.. ఆచార్య మరింత ఆలస్యం?
రాంచరణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తనదైన మార్క్ ను చూపిస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో అరుదైన రికార్డును రాంచరణ్ సొంతం చేసుకున్నారు. ట్వీటర్లో అత్యంత వేగవంతంగా 10లక్షల మంది(ఒక మిలియన్) ఫాలోవర్స్ ను సంపాదించుకొని సోషల్ మీడియాలోనూ తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు.రాంచరణ్ ఈ ఏడాది తన పుట్టిన రోజు(మార్చి 27)న ట్వీటర్లోకి అడుగుపెట్టాడు. కేవలం 233రోజుల్లోనే రాంచరణ్ ఒక మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. అత్యంత వేగంగా 10లక్షల మంది ఫాలోవర్స్ ను దక్కించుకున్న రికార్డును చెర్రీ సొంతం చేసుకున్నాడు. దీంతో చరణ్ అభిమానులకు దీపావళి ముందుగానే వచ్చినట్లు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: వెంకీ-రానా కాంబోపై మొదలైన నెగిటివ్ టాక్..!
రాంచరణ్ ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ కు ముందే రాంచరణ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక ఈ సినిమా రిలీజయ్యాక రాంచరణ్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. కాగా రాంచరణ్ ట్వీటర్లో కేవలం మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లను మాత్రమే ఫాలో అవుతుండటం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్