Bigg Boss 5 : టెలివిజన్‌లో అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 5 విజయవంతంగా దూసుకుపోతుంది. మొదట్లో అంత ఆసక్తికరంగా అనిపించకపోయిన.. వారాలు గడుస్తున్న సమయంలో బిగ్‌బాస్ రసవత్తరంగా మారింది. 19 మందితో మొదలైన షోలో ఇప్పటివరకు సరయూ, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, లహరి, హమిదా, శ్వేత, ప్రియా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఏడు వారాలు పూర్తిచేసుకుని ఎనిమిదవ వారం ఆసక్తికరంగా సాగుతుంది బిగ్‌బాస్. ఇదిలా ఉంటే.. మొన్నటి ఎపిసోడ్లో పలు ఆసక్తికర ఘటనలు జరిగాయి. ఒక వైపు సన్నీ, శ్రీరామచంద్ర మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది.
మానసికంగా డిస్ట్రబ్ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్ అయిపోతాం అని షన్నూ అనగా… నీ వల్లే మెంటల్‌గా ఇబ్బంది పడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది సిరి. దీంతో చిరాకుగా అనిపిస్తే దూరం పెట్టు అని షన్నూ అనేశాడు. అయితే ఆకస్మాత్తుగా షన్నూకు ముద్దు పెట్టి సైలెంట్‌గా వెళ్లిపోయింది సిరి. దీంతో ఒక్కసారిగా షన్నూ షాకవుతూ.. ఆ తర్వాత వెంటనే ముసి ముసి నవ్వులు నవ్వుతూ జాగ్రత్తగా రికార్డ్ చేశారా ? అంటూ కెమెరాలపై చూస్తూ నాకు ఉంటదిపుడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. అయితే సిరి.. షన్నుకు ముద్దుపెట్టడం ఎంటనీ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికే సిరి… శ్రీహాన్‌తో ప్రేమలో ఉందని.. కానీ అన్ని కెమెరాల ముందే షన్నూకు ముద్దుపెట్టడం ఏంటనీ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ స్పందించాడు. ఇప్పుడేంట్రా నేను ఏడవాలా ? షార్ట్ ఫిల్మ్స్ , సినిమాల్లో చేస్తే ఓకే కదా మీకు అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో కామెంట్ చేస్తూ సిరికి మద్దతుగా నిలిచాడు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Bigg boss 5 telugu siri boyfriend srihan reaction on she kissed shanmukh
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com