Scene Movie: వరుస సూపర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘సీన్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం , మలయాళం భాషల్లో గ్రాండ్ గా విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అయితే తెలుగు వెర్షన్ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. కేవలం 3 కోట్ల 85 లక్షల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది ఈ చిత్రం. కానీ ఓవరాల్ వరల్డ్ వైడ్ గా మాత్రం సూర్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 37 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఆడియన్స్ లో మంచి పాజిటివ్ మౌత్ టాక్ ఉండడం తో వీకెండ్ కి 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని , ఫుల్ రన్ లో 250 నుండి 300 కోట్ల మధ్యలో గ్రాస్ వస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచినటువంటి వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు ప్రాంతం నుండి 12 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా , తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల 85 లక్షలు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 2 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కేరళ నుండి 5 కోట్ల 80 లక్షలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 35 లక్షలు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఈ చిత్రానికి 12 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఓవరాల్ గా ఈ చిత్రానికి 37 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 17 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని పూర్తి స్థాయి సూపర్ హిట్ చిత్రం గా మారాలంటే ఈ సినిమా మరో 68 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.