Ramayana Movie: నితీష్ తివారి తెరకెక్కించిన ‘రామాయణ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి 230 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అట. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. యాష్ నటించిన టాక్సిక్ చిత్రం పెద్ద ఫ్లాప్ అవ్వడం తో , ‘రామాయణ’ చిత్రానికి సంబంధించిన రైట్స్ ని దిల్ రాజు కి ఉచితంగా వచ్చేలా చేసాడట హీరో యాష్. ఈ చిత్రానికి యాష్ కూడా సహా నిర్మాత అవ్వడంతో ఇది సాధ్యపడింది. అయితే విడుదలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి దిల్ రాజు కాస్త తడబడ్డాడు. కానీ టాక్ మంచిగా రావడం తో వసూళ్లు బాగా పుంజుకున్నాయి.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మన తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు 7 కోట్ల 55 లక్షల రూపాయిలు రాగా, రెండవ రోజు 8 కోట్ల 15 లక్షల రూపాయిలు వచ్చాయి. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 97 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కర్ణాటక నుండి 22 కోట్ల 15 లక్షలు , తమిళనాడు నుండి 5 కోట్ల 60 లక్షలు , కేరళ నుండి 4 కోట్ల 25 లక్షలు , ఓవర్సీస్ నుండి 85 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 1420 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.