Mega Verse: రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి నెట్ ఫ్లిక్స్ లో ‘మెగా వర్స్’ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారు. మొదటి ఎపిసోడ్ కి బ్రహ్మానందం , సునీల్ గెస్టులుగా రాగా, రెండవ ఎపిసోడ్ కి కమల్ హాసన్ గెస్ట్ గా వచ్చాడు. ఈ రెండు ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయని అంటున్నారు. చిరంజీవి లోని ఈ సరికొత్త యాంగిల్ ని చూసి అభిమానులు మెంటలెక్కిపోతారంటున్నారు. ఈ టాక్ షో కి ఒక ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ వంటి వారు పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుంది.
ఇది ఇలా ఉండగా నిన్న అక్కినేని నాగార్జున , నాగ చైతన్య , అఖిల్ లతో కలిసి ఒక ఎపిసోడ్ ని షూట్ చేశారట. నాగార్జున , చిరంజీవి మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సొంత అన్నదమ్ములు లాగా వీళ్లిద్దరు కలిసి మెలిసి ఉంటారు. ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమని చూపిస్తుంటారు. ఇక అఖిల్ ని చిరంజీవి తన సొంతకొడుకు లాగా ట్రీట్ చేయడం , అఖిల్ కూడా చిరంజీవి ని పెద్దనాన్న అంటూ పిలవడం వంటివి మన అందరికీ తెలిసిందే. అలాంటి వీళ్ళ మధ్య ఇలాంటి టాక్ షో అంటే కచ్చితంగా టీఆర్ఫీ రేటింగ్స్ బద్దలు అవుతుందని అంటున్నారు నెటిజెన్స్. త్వరలోనే ఈ షో కి సంబంధించిన ప్రోమో రాబోతుంది. సంక్రాంతి కానుకగా , ఈ మెగా టాక్ షో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రోమో ఎపిసోడ్ కి ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడట. ఈ నెలలోనే ఆ ప్రోమో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ షో తో మెగాస్టార్ ఆడియన్స్ ని ఎలా అలరించబోతున్నాడో చూడాలి.