Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల్లో ప్రధానమంత్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక్కడ స్థానిక నాయకత్వం రకరకాల ఆరోపణల నేపథ్యంలో ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నది. అయితే దానిని విజయానికి అడ్డుకాకుండా చూసుకునేందుకు భారతీయ జనతా పార్టీ రంగంలోకి దిగింది.
ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలుమార్లు కర్ణాటకలో పర్యటించారు. వేలకోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం నాలుగు రోజులుగా ఆయన కర్ణాటకలోనే ఉంటున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను చాలా తెలివిగా తిప్పికొడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఎలాగైతే ప్రచారం చేశారో… కర్ణాటకలో అదే స్థాయిలో ప్రచారం సాగిస్తున్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటి హబ్ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయ్యారు. వారి మనసు చూరకొనేందుకు నరేంద్ర మోదీ నేరుగా రంగంలోకి దిగారు. అంతేకాదు బెంగళూరు పరిషత్ ప్రాంతాల్లోని నియోజకవర్గాలు కవర్ చేస్తూ శనివారం భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం బెంగళూరులోని కోనేన కుంట లో నరేంద్ర మోదీ రోడ్ షో ప్రారంభమైంది. నిప్పులు చెరిగే ఎండను కూడా లెక్కచేయకుండా ఆయన రోడ్డు షో లో పాల్గొన్నారు. జెపి నగర్, జయ నగర్, జయనగర్ మెట్రో స్టేషన్, మాధవ రావు సర్కిల్, సౌత్ ఎండ్ సర్కిల్ ప్రధాని సందడి చేశారు. అక్కడి ఓటర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. ప్రధానమంత్రిని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అక్కడి నుంచి రమణ మహర్షి రోడ్డు, ఆర్ బీఐ లే అవుట్, రోస్ గార్డెన్, శిర్సి సర్కిల్, జేజే నగర్, బిన్నీ మిల్ రోడ్డు, శాలిని గ్రౌండ్స్, ఆర్ముగం సర్కిల్ మీదుగా మోదీ రోడ్ షో నిర్వహించారు.
మోడీ మ్యాజిక్ తో కర్ణాటక ఎన్నికల ముఖ చిత్రం మార్పు చెందుతోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.