Ram Pothineni: మాజీ సీఎం వై ఎస్ జగన్ పై హీరో రామ్ పోతినేని చేసి కామెంట్ తెరపైకి వచ్చింది. మీ వెనుక కుట్ర జరుగుతుంది గమనించగలరని రామ్ పోతినేని ట్వీట్ చేశారు. అయితే ఇది ఇప్పటి ట్వీట్ కాదు. అయితే జగన్ ఓటమిని రామ్ పోతినేని నాలుగేళ్ళ క్రితమే పసిగట్టాడని, ఆయన్ని హెచ్చరించారంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. మేటర్ లోకి వెళితే… కోవిడ్ సమయంలో విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్ ని కోవిడ్ కేర్ సెంటర్ గా రమేష్ హాస్పిటల్స్ మార్చారు. అక్కడ దాదాపు 30 మంది కోవిడ్ రోగులు ఉన్నారు.
తెల్లవారు ఝామున స్వర్ణ ప్యాలస్ హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది కోవిడ్ రోగులు కన్నుమూశారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా రోగులను అక్కడ ఉంచారంటూ రమేష్ హాస్పటిల్ మేనేజ్మెంట్ పై అధికారులు చర్యలకు పాల్పడ్డారు. ముగ్గురు రమేష్ హాస్పిటల్ సిబ్బందిని అరెస్ట్ చేశారు.
Also Read: HBD Balakrishna: యువరత్న నుంచి నట సింహం గా ఎదిగిన బాలయ్య ప్రస్థానం…
మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. ఆయన స్పందించకపోవడంతో పాటు పరారు అయ్యారు. ఆయన కోసం గాలింపు బృందాలు ఏర్పాటు చేశారు. రమేష్ బాబు హీరో రామ్ పోతినేనికి అంకుల్ అవుతారు. రమేష్ బాబు పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును రామ్ పోతినేని తప్పుబట్టారు. సోషల్ మీడియా వేదికగా తన అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ”పెద్ద కుట్ర జరుగుతున్నట్లు ఉంది. సీఎం ని తప్పుగా చిత్రీకరించేందుకు. జగన్ గారు మీరు మీ కింద పని చేసే వాళ్ళు మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వలన మీ రెప్యుటేషన్ , మీ మీద పెట్టుకున్న నమ్మకం దెబ్బతింటున్నాయి. వాళ్ళ మీద ఓ లుక్కు వేయండి…” అని 2020 ఆగస్టు లో ట్వీట్ చేశాడు.
Also Read: NTR: హీరోగా మరో ఎన్టీఆర్… నందమూరి వంశంలో ఎవరి కుమారుడో తెలుసా?
ఈ ట్వీట్ ని తెరపైకి తెస్తూ జగన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆయన నమ్మిన సలహాదారులు, ఐ ప్యాక్ టీమ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జగన్ ని రామ్ పోతినేని ముందుగానే హెచ్చరించాడని అంటున్నారు. నిజానికి రామ్ పోతినేని అప్పట్లో ఏపీ ప్రభుత్వం పై అసహనంతో ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. జగన్ ఓటమి నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది!! సీఎంని తప్పుగా చూపించడానికి! @ysjagan garu.మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్ కీ,మీ మీద మేం పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది.వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం#APisWatching
— RAm POthineni (@ramsayz) August 15, 2020