https://oktelugu.com/

HBD Balakrishna: యువరత్న నుంచి నట సింహం గా ఎదిగిన బాలయ్య ప్రస్థానం…

HBD Balakrishna: బాలయ్య బాబును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎన్టీఆర్ చాలా గట్టిగా నిశ్చయించుకున్నారు. అందుకే తన సినిమాకి వారసుడిగా బాలకృష్ణని ప్రకటించారు.

Written By: , Updated On : June 10, 2024 / 10:47 AM IST
Balakrishna birthday special his film career and journey

Balakrishna birthday special his film career and journey

Follow us on

HBD Balakrishna: విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతటి ఘన కీర్తిని సాధించారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన నట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరో నందమూరి బాలకృష్ణ.. అయితే మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ తన నటనకు వారసుడిగా బాలకృష్ణ ను ఎంచుకున్నాడు. ఎందుకంటే చిన్నతనం నుంచే బాలకృష్ణ తెలుగు పద్యాలు గాని, సామెతలు గాని చాలా బాగా చెప్పేవారట. ఇక పద ఉచ్చరణ కూడా దోషాలు లేకుండా చాలా స్పష్టంగా ఉండేవట..

అందువల్లే బాలయ్య బాబును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎన్టీఆర్ చాలా గట్టిగా నిశ్చయించుకున్నారు. అందుకే తన సినిమాకి వారసుడిగా బాలకృష్ణని ప్రకటించారు. ఇక ఆయన అనుకున్నట్టుగానే బాలయ్య ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరోగా మారాడు. ఇక మొదట్లో “యువరత్న నందమూరి బాలకృష్ణ” గా మంచి పేరును దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత ‘నటసింహం ‘గా తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక మొత్తానికైతే తన 35 సంవత్సరాల సినిమా కెరియర్ లో బాలయ్య బాబు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. పౌరాణికం, జానపదం, సైన్స్ ఫిక్షన్, కమర్షియల్ ఇలా ఎన్నో జానర్స్ లో సినిమాలను తీసి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ముఖ్యంగా బాలకృష్ణ పేరు చెబితే మాస్ ఆడియన్స్ లో పూనకాలు వస్తాయి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా.. ఆయన చివరి సినిమా ఇదేనా..?

ఇక మంగమ్మ గారి మనవడు, ఆదిత్య 369, భైరవ ద్వీపం, రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ లాంటి సినిమాలు బాలయ్యకు మాస్ ఫాలోయింగ్ ను ఇస్తూనే సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక బాలయ్య బాబు పేరు చెబితే అద్భుతమైన డైలాగులు గుర్తుకొస్తూ ఉంటాయి. రౌద్ర రసం ను పండించడంలో గానీ,రౌడీలను వణికించే డైలాగులు చెప్పడంలో గానీ బాలయ్యను మించిన హీరో మరొకరు లేరని చెప్పడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి బాలయ్య బాబు ఈరోజు 64వ పుట్టినరోజు ను జరుపుకుంటున్న సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులు అతనికి బర్త్ డే విషెష్ ను తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

Also Read: Jagapathi Babu: హీరోయిన్స్ తో షాపింగ్ లు, పార్టీలు… జగపతిబాబు దివాళా తీయడానికి అసలు కారణం ఇదా!

అయితే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని కొద్దిరోజుల క్రితమే రిలీజ్ చేశారు. ఇక దానికి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించబోతుంది అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు మంచి కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి బాలయ్య బాబు పొలిటికల్ గా కూడా తన సత్తాను చాటుకున్నారు. ఇక ఇలాంటి బాలయ్య బాబు తన కెరియర్ లో మరెన్నో బర్త్ డే లు జరుపుకుంటూ అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ లో ముందుకు దూసుకెళ్లాలని కోరుకుందాం…