Ram Gopal Varma Tweet: రామ్ గోపాల్ వర్మకు వివాదానికి విడదీయరాని సంబంధం ఉంది. వివాదం వర్మకి నీడగా ఉంటుంది. ఆయన సినిమాలకు అదే ప్రధాన పెట్టుబడి. ఇక ఆయనకు వివాదమే ఎంటర్ టైన్మెంట్. అందుకే, ఈ సంచలన దర్శకుడు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటారు. పైగా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పబ్లిసిటి చేస్తాడు. తాజాగా కృష్ణంరాజు మృతి పై టాలీవుడ్ పెద్దలు వ్యవహరించిన విధానం పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

కృష్ణంరాజు మృతికి నివాళిగా షూటింగ్‌లు ఆపకపోవడం ఏమిటి అంటూ వర్మ ఫైర్ అయ్యాడు. ‘ఆ మహానటుడి కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని స్వార్థపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!’ అని వర్మ మొదట ఒక ట్వీట్ పోస్ట్ పెట్టాడు. అనంతరం వర్మ మరో సంచలన ట్వీట్ చేశాడు. ‘‘కృష్ణగారికి, మురళీమోహన్ గారికి, చిరంజీవి, మోహన్ బాబు, బాలయ్య, ప్రభాస్, మహేష్, కల్యాణ్‌కి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే.. రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.’’ అంటూ వర్మ ఘాటు ట్వీట్ పోస్ట్ చేశాడు.
ఏది ఏమైనా వర్మ అందరి లాంటోడు కాదు. వర్మ గురించి త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక చెట్టు మీద మామిడి కాయ ఉంది. చెట్టు కింద ఒకడు దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. పైన పండు వదిలేసి కింద వేరే దేని కోసమో వెతుకుతున్నాడు పిచ్చోడు అని అందరూ అనుకుంటారు. కానీ వాడు ఆ పండుని కొట్టడానికి రాయి కోసం వెతుకుతున్నాడు.

కరెక్ట్ గా చెప్పుకుంటే ఇలాంటి పరిస్థితే ఆర్జీవీది కూడా. దారిన పోయే వారి కన్నా ఎంతో క్లారిటీ గా, ఫోకస్డ్ గా తనకు కావాల్సిన పని చేసుకుంటూ పోతున్నాడు ఆర్జీవీ. అంతేగాని, దారిన పోయే దానయ్యలను, లేక పని చేసుకునే పాపయ్యలను ఆర్జీవీ పట్టించుకోడు. ఏది ఏమైనా ఆర్జీవీ గత వైభవం తిరిగి రానట్టే. అయితే, ఆర్జీవీ సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు, కానీ ఆర్జీవీ ఎప్పుడు సక్సెసే.
[…] […]