Pranitha: తల్లైతే గ్లామర్ పోతుందని ఎవరన్నారు. ప్రణీతను చూస్తే ఎవరైనా ఆ అభిప్రాయం మార్చుకోవాల్సిందే. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత సుభాష్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. హాట్ ఫోటో షూట్స్ తో గ్లామర్ ఒలకబోస్తున్నారు. వెండితెరపై ప్రణీత పద్ధతి గల పాత్రలు చేశారు. ఆమె మితిమీరిన స్కిన్ షో చేసిన దాఖలాలు లేవు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది. అందాల ప్రదర్శన చేస్తూ తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. తాజాగా ప్రణీత షేర్ చేసిన సెల్ఫీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

ఒంటిపై ఉన్న జాకెట్ తీసేసి లోదుస్తులు కనిపించేలా ఓ హాట్ సెల్ఫీ దిగారు. బాత్రూంలో దిగిన ఆ ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రణీత సూపర్ హాట్ సెల్ఫీ క్షణాల్లో వైరల్ గా మారింది. తల్లై నెలలు కూడా గడవక ముందే ఈ రేంజ్ గ్లామర్ షో ఏందీ బాబోయ్ అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి సదరు సెల్ఫీతో ప్రణీత తన ఫిట్నెస్ చూపించాలనుకుంటుంది. సాధారణంగా పిల్లలు కన్నాక ఆడవాళ్లు బరువు పెరిగి షేపవుట్ అవుతారు. ప్రణీత పర్ఫెక్ట్ జీరో సైజు ప్యాక్ మైంటైన్ చేస్తుంది. ప్రణీత సెల్ఫీపై నెటిజెన్స్ తోచిన కామెంట్స్ చేస్తున్నారు.
గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న హీరోయిన్ ఫిట్నెస్ కి ప్రాణం ఇస్తారు. ఏమాత్రం షేప్ కోల్పోయినా కెరీర్ ముగిసినట్లే. అందుకే కడుపు మాడ్చుకొని, కోరికలు పక్కనపెట్టి గంటల తరబడి జిమ్ లో వ్యాయామం చేస్తారు.కాగా ఈ మధ్య ప్రణీత ఓ విషయంలో విమర్శల పాలయ్యారు. పండుగ వేళ భర్తకు పాద పూజ చేశారు. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. కొందరు ఫెమిస్ట్స్ దీన్ని తప్పుబట్టారు. ఈ రోజుల్లో కూడా పాద పూజలు చేయడం ఏమిటీ? ఇది పురుషాధిక్య సమాజాన్ని మరింత ప్రోత్సహించడమే, అని ప్రణీతపై సోషల్ మీడియా దాడి చేశారు.

ఈ సెటైర్స్ ని ప్రణీత తిప్పికొట్టింది. హీరోయిన్ అయినంత మాత్రాన సంప్రదాయాలు వదిలేయాలా? చిన్నప్పటి నుండి ఇవన్నీ చూస్తూ పెరిగాను. మా కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఇది చేశారు. ఆచారాలు పాటించడం తప్పేమీ కాదని, ఫైర్ అయ్యింది. కొందరు ప్రణీతకు మద్దతుగా నిలిచారు. 2021 మే 30న బిజినెస్ మాన్ నితిన్ రాజును ప్రణీత వివాహం చేసుకున్నారు. నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. ఇటీవల ప్రణీత పాపకు జన్మనిచ్చారు.
పెళ్లి తర్వాత కూడా ప్రణీత నటిగా కొనసాగుతున్నారు. తెలుగులో ప్రణీత ఏం పిల్లో ఏం పిల్లడో, బావ, అత్తారింటికి దారేది, రభస వంటి చిత్రాల్లో నటించారు. పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ అందుకుంది. తెలుగులో ప్రణీత నటించిన చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఇటీవల ఆమె వరుసగా బాలీవుడ్ చిత్రాలు చేశారు. హంగామా 2, భుజ్ చిత్రాల్లో ప్రణీత నటించారు. ప్రస్తుతం ఆమె ‘రామన అవతార’ అనే కన్నడ చిత్రం చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఆమెను బాగా మిస్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రణీత ఆ లోటు తీరుస్తున్నారు.