https://oktelugu.com/

Ram Gopal Varma: మరోకొత్త ప్రాజెక్టు ను రెడీ చేసిన ఆర్జీవి… “తులసి తీర్ధం” అనే టైటిల్ ఖరారు

Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా ఉండే వర్మ ఎప్పుడూ ఏదో ఒక విషయం పై  స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అది ఇది లేకుండా అన్ని విషయాల్లో వేలు పెడుతూ విమర్శల పాలవుతూ ఉంటాడు. రాజకీయం, సినిమాలు, ఫ్యాక్షన్ ఇలా అన్నింటిని కవర్ చేస్తూ సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు వర్మ. అయితే ఇప్పుడు మళ్లీ భయపెట్టైందుకు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 / 04:23 PM IST
    Follow us on

    Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా ఉండే వర్మ ఎప్పుడూ ఏదో ఒక విషయం పై  స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. అది ఇది లేకుండా అన్ని విషయాల్లో వేలు పెడుతూ విమర్శల పాలవుతూ ఉంటాడు. రాజకీయం, సినిమాలు, ఫ్యాక్షన్ ఇలా అన్నింటిని కవర్ చేస్తూ సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు వర్మ. అయితే ఇప్పుడు మళ్లీ భయపెట్టైందుకు సిద్ధమయ్యాడు ఆర్జీవి.

    Ram Gopal Varma

    Also Read: భారీ లెవెల్లో ప్రమోషన్స్ ప్లాన్ చేసిన “శ్యామ్ సింగరాయ్” టీమ్…

    కరోనా సమయంలో కూడా అంతా ఇంటికేపరిమితమైనప్పుడూ వర్మ తన వర్క్ కి బ్రేక్ ఇవ్వలేదు. ఇప్పటికే కొండా సురేఖ దంపతులపై సినిమా తెరకెక్కిస్తున్న వర్మ… తాజాగా తన నెక్ట్స్ మూవీ అనౌన్స్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకి  ”తులసి తీర్థం” అనే టైటిల్‌ ని ఫిక్స్‌ చేశాడు. ఈ మేరకు తులసి తీర్థం పోస్టర్ ను యండమూరి వీరేంద్రనాధ్ తో విడుదల చేయించాడు. సోషల్ మీడియా వేదికగా “నా తదుపరి భయానక చిత్రం తులసి తీర్ధం  యండమూరి వీరేంద్రనాథ్ రచించిన సంచలనాత్మక షాకింగ్ నవల “తులసి దళం” కి సీక్వెల్ అని పోస్ట్ చేశాడు. ఈ చిత్రాన్ని భీమవరం టాకీస్ నిర్మించింది అంటూ ట్వీట్ చేశాడు.

    మూడు దశాబ్దాల క్రితం యండమూరి రచించిన “తులసీదళం” నవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ తెలుగు పాఠకులను మెప్పించిన ఈ నవల సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.ఇప్పుడు దీనికి సీక్వెల్ అన్నట్టుగా తెరకెక్కనున్న ‘తులసితీర్థం’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి.

    Also Read: సింపుల్​గా ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్​.. బాలయ్య బాబే కారణం?