https://oktelugu.com/

CM KCR: సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై అన్ని అనుమానాలే?

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఢిల్లీ పర్యటనకు వెళ్లినా ఏమీ పరిష్కరించకుండానే తిరిగి రావడంతో విమర్శలు మూటగట్టుకున్నారు. నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్నా ఏ ఒక్క సమస్యపై కూడా స్పష్టమైన హామీ రాబట్టకుండా తట్టు బుట్ట సర్దుకుని ఇంటి బాట పట్టారు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది పరిస్థితి. తాడేపేడో తేల్చుకుని వస్తానని సవాల్ విసిరినా చివరకు మాత్రం ఏం సాధించకుండానే […]

Written By: , Updated On : November 25, 2021 / 04:26 PM IST
Follow us on

CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఢిల్లీ పర్యటనకు వెళ్లినా ఏమీ పరిష్కరించకుండానే తిరిగి రావడంతో విమర్శలు మూటగట్టుకున్నారు. నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్నా ఏ ఒక్క సమస్యపై కూడా స్పష్టమైన హామీ రాబట్టకుండా తట్టు బుట్ట సర్దుకుని ఇంటి బాట పట్టారు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది పరిస్థితి. తాడేపేడో తేల్చుకుని వస్తానని సవాల్ విసిరినా చివరకు మాత్రం ఏం సాధించకుండానే వెనుదిరగడం గమనార్హం.
CM KCR
అసలు సీఎం ఢిల్లీ పర్యటన అధికారికమా? లేక వ్యక్తిగతమా అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని, మంత్రుల అపాయింట్ మెంట్ తీసుకుని వారిని కలిసి వస్తానని చెప్పినా అక్కడ మాత్రం ఎవరిని కలవకపోవడం విమర్శలకు తావిస్తోంది. పైగా పొంతన లేని సమాధానాలు చెబుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ మాత్రం దానికి ఢిల్లీ దాకా ఎందుకు వెళ్లినట్లని ప్రతిపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి.

వరిధాన్యం కొనుగోలు ప్రధాన ఎజెండాగా వెళ్లిన సీఎం కేసీఆర్ మాత్రం ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో జరిగిన సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. మంత్రులను, అధికారులను మాత్రమే పంపి తాను మాత్రం గైర్హాజరు కావడంపైనా విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ ఎందుకు సమాధానం చెప్పడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Also Read: Population In India: దేశంలో తగ్గుతున్న జనాభా.. వెల్లడిస్తున్న గణాంకాలు

అధికారిక పర్యటనకు వెళ్లినా అధికారికంగా ఎవరిని కలవకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై అనేక విమర్శలు వస్తున్నా ఎవరిలో కూడా చలనం లేకుండా పోతోంది. దేనిపై కూడా సమాధానాలు చెప్పే అవకాశాలు లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో సహజంగానే వారి పర్యటనపై అందరిలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.

Also Read: India -Pakistan war in 1971: భారత్ -పాక్ యుద్ధం..: 1971 డిసెంబర్ నెలలో ఏం జరిగింది..?

Tags