https://oktelugu.com/

Bheemla nayak: భీమ్లానాయక్​ సాంగ్​ రిలీజ్​ వాయిదా.. ఆయన మరణించడమే కారణమా?

Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి … తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్ల ప్రోమోలు, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 1, 2021 / 11:30 AM IST
    Follow us on

    Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి … తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్ల ప్రోమోలు, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

    కాగా, ఈ సినిమా నాలుగో పాటను ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే, మేకర్స్ ఆ రిలీజ్​ను వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అడవి తల్లి మాట టైటిల్​తో రాన్న ఈ పాటను కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇలా వాయిదా వేయడానికి కారణం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మరణించడమే అని తెలుస్తోంది. ఇటువంటి సమయంలో ఎలాంటి అప్​డేట్స్ ఇవ్వడం సరికాదని భావించి ఈ నిర్ణయం తీసుకన్నట్లు సమాచారం.