https://oktelugu.com/

Best Cars: సిటీల్లో ఉండేవారికి ఈ కార్లు బెస్ట్.. అవేవో తెలుసుకోండి..

రెనాల్ట్ కంపెనీ గురించి కారు వాడేవారికి దాదాపు తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ నుంచి క్విడ్ మోడల్ ది బెస్ట్ గా నిలుస్తోంది. ఇది 1.0 లీటర్ 3 సిలిండర్ తో పాటు పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : June 27, 2024 / 10:59 AM IST

    Best Cars

    Follow us on

    Best Cars: కారు ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఒకప్పుడు కేవలం పట్టణాలు, నగరాల్లో మాత్రమే కార్లు ఉండేవి. కానీ ఇప్పుడు గ్రామాల వారు సైతం ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే పట్టణాలు, నగరాల్లో ఉండేవారు ప్రతీరోజూ కార్యాలయం లేదా ఇతర అవసరాల నిమిత్తం కారును ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో వీరు ప్రత్యేక మైన కారును కొనాలని చూస్తారు. ఇలాంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా తయారు చేస్తాయి. ఇక్కడ ఉండే ట్రాఫిక్, రోడ్లను దృష్టిలో ఉంచుకొని కారుకు సంబంధించిన పార్ట్స్ ను అమరుస్తారు. ఈ నేపథ్యంలో సిటీల్లో ఉండేవారి కోసం ప్రత్యేకంగా కొన్ని కార్లు ఉన్నాయి. ఆ కార్లు ఏవో తెలుసుకుందాం.

    రెనాల్ట్ కంపెనీ గురించి కారు వాడేవారికి దాదాపు తెలిసే ఉంటుంది. ఈ కంపెనీ నుంచి క్విడ్ మోడల్ ది బెస్ట్ గా నిలుస్తోంది. ఇది 1.0 లీటర్ 3 సిలిండర్ తో పాటు పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 67 బీహెచ్ పీ పవర్ తో పాటు 91 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.45 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ మోడల్ లీటర్ పెట్రోల్ కు 22.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. టాటా కంపెనీకి చెందిన టియాగో పెట్రోల్ వేరియంట్ 19.43 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ కారు రూ.5.6 లక్షల నుంచి రూ.8.90 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

    మారుతి కంపెనీకి చెందిన ఆల్టో కే 10.. 1.0 లీటర్ పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వెర్షన్ లో లభిస్తుంది. ఈ మోడల్ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో లీటర్ పెట్రోల్ కు 24.09 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇదే కంపెనీకి చెందిన ఎస్ ప్రెస్సో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 67 బీహెచ్ పీ పవర్, 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉన్న ఈ కారు లీటర్ కు 25.30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

    పై కార్లన్నీ సిటీల్లో ఉండేవారికి కన్వినెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా కార్యాలయ అవసరాల నిమిత్తం వీరు ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇస్తాయి.