https://oktelugu.com/

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ కేసులో హైకోర్టు సంచలన ఆదేశాలు..కూటమి ప్రభుత్వానికి గట్టి షాక్!

రామ్ గోపాల్ వర్మ అత్యంత నీచంగా ట్విట్టర్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడం కోట్లాది మంది తెలుగు ప్రజలు చూసారు. ఆయన చేసిన ఈ పనిపై పెదవి విరిచారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 05:34 PM IST

    Ram Gopal Varma(8)

    Follow us on

    Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి అందరికీ తెలిసిందే. వ్యూహం సినిమా విడుదలకు ముందు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను ఉద్దేశిస్తూ, వాళ్ళ ఫోటోలను మార్ఫింగ్ చేసి, వాళ్ళను అగౌరవపరిచేలా ట్విట్టర్ లో పోస్టులు చేసారని, ఈ పోస్టుల కారణంగా లక్షలాది మంది అభిమానుల మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ ఫిర్యాదుపై రామ్ గోపాల్ వర్మ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు లో ముందస్తు బెయిల్ పిటీషన్ వేస్తూ, తనని కావాలని టార్గెట్ చేసి అరెస్ట్ చేయించే కుట్ర జరుగుతుందని, పోలీస్ విచారణ పేరుతో నన్ను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించబోతున్నారని , తన మీద అక్రమంగా వేసిన ఈ కేసులన్నీ కొట్టివేయాలంటూ రామ్ గోపాల్ వర్మ పిటీషన్ దాఖా చేసాడు.

    దీనిని విచారించిన హై కోర్టు రామ్ గోపాల్ వర్మ పై ఎలాంటి చర్యలు తీసుకోరాదని వారం రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వర్మ పై కౌంటర్ దాఖలు చేయగా, ఇటీవలే ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. దీనిని విచారించిన ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు గతంలో చెప్పిన మాటలే మరోసారి గుర్తు చేసింది. రామ్ గోపాల్ వర్మ పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. దీంతో టీడీపీ, జనసేన అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. మరో పక్క రామ్ గోపాల్ వర్మ వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ రేపు జరుగనుంది. అత్యధిక శాతం ఆయనకి అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ఏపీ ప్రభుత్వం పై టీడీపీ, జనసేన అభిమానులు ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

    ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అత్యంత నీచంగా ట్విట్టర్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడం కోట్లాది మంది తెలుగు ప్రజలు చూసారు. ఆయన చేసిన ఈ పనిపై పెదవి విరిచారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన రామ్ గోపాల్ వర్మ ఇంతకు దిగజారిపోవడం చూడలేకపోతున్నామని ఆయన అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేసారు. బహిరంగంగా అందరూ చూసే విధంగా ఇంత పెద్ద తప్పు చేసి కూడా రామ్ గోపాల్ వర్మ తప్పించుకుంటే, ఈ ప్రభుత్వం పై జనాల్లో నమ్మకం పోతుందని, రేపు ఏ తప్పు జరిగినా ఇలాగే తప్పించుకునే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయం లో హై కోర్టు ఎలాంటి తీర్పుని ఇస్తుందో చూడాలి. మరోపక్క రామ్ గోపాల్ వర్మ కి మద్దతుగా మాజీ సీఎం జగన్ మరియు ఆయన వైసీపీ పార్టీ నేతలు మొత్తం సపోర్టుగా నిల్చిన సంగతి తెలిసిందే.