https://oktelugu.com/

Tayota Welfire  : ఈ కారులో కూర్చుంటే.. ఇంద్రభవనంలో ఉన్నట్లే.. ధర ఎంతో తెలుసా?

Tayota కంపెనీకి చెందిన Welfire వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రయాణిస్తే ఇంద్రభవనంలో కూర్చున్నట్లే అని కొందరు ఇందులో ప్రయాణించిన వారు చెబుతున్నారు. అయితే లగ్జరీ కారు కావాలను చూసేవారికి ఈ కారు ధర ఎంతో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితే..

Written By:
  • Srinivas
  • , Updated On : December 15, 2024 / 04:41 PM IST

    Tayota Welfire 

    Follow us on

    Tayota Welfire  : దేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. సామాన్యుల నుంచి ధనిక వర్గాల వరకు అందరూ సొంతంగా కారు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే కాస్త డబ్బు ఉన్న వారు హైఫై కారు ఉండాలని అనుకుంటారు. ధర ఎలా ఉన్నా.. డ్రైవింగ్ లో మంచి అనుభూతి పొందాలని అనుకుంటారు. ఇటువంటి వారి కోసం కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఆకట్టుకునేమోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుంటాయి. వీటిలో Tayota కంపెనీకి చెందిన Welfire వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రయాణిస్తే ఇంద్రభవనంలో కూర్చున్నట్లే అని కొందరు ఇందులో ప్రయాణించిన వారు చెబుతున్నారు. అయితే లగ్జరీ కారు కావాలను చూసేవారికి ఈ కారు ధర ఎంతో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ఆ వివరాల్లోకి వెళితే..

    భారత్ లో సాధారణ కార్లు మాత్రమే కాకుండా లగ్జరీ కార్లకు డిమాండ్ ఉంటుంది. అయితే ఒకప్పుడు కొందరు ప్రముఖులు విదేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకునేవారు. కానీ ఇప్పుడు దేశీయంగా కొన్ని కంపెనీలు ఖరీదైన కార్లను తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా టయోటా నుంచి రిలీజ్ అయినా వెల్ ఫైర్ కారు ఎక్కువ సేల్స్ నమోదు చేసుకుటుంది. 2024 నవంబర్ లో ఈ కారును 86 మంది కొనుగోలు చేశారు. గత ఏడాది కంటే ఇవి 62 శాతం ఎక్కువ.

    Tayota Welfire కారులో 2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 193 బీహెచ్ పీ పవర్ తో పాటు 240 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. పెట్రోల్ తో పాటు ఎలక్ట్రిక్ వేరియంట్ ను కలిగి ఉన్న ఈ కారు లీటర్ ఇంధనానికి 19.28 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్ లు, ఆకర్షణీయమైన బంపర్ సట్, డ్యాష్ బోర్డు చుట్టూ సాప్ట్ టచ్ కంట్రోల్, డిజిటల్ ఇనిస్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. పవర్ స్టీరింగ్ వీల్, రూఫ్ మౌంటెడ్ ఎంటర్ టైన్మెంట్ సౌకర్యాలు ఉన్నాయి.

    ఇందులో భద్రతా ఫీచర్లను పకడ్బందీగా అమర్చారు. ఆడాస్ ఫీచర్లతో పాటు 360 డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ప్రీ కొలిజన్ సేప్టీ వంటి లేటేస్ట్ ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి. వెహికల్ డయాగ్నస్టిక్, రిమోట్ డోర్ లాక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ కారు ధర గురించి ఆసక్తికంగా ఉంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో రూ.1.22 నుంచి రూ.1.32 కోట్ల వరకు విక్రయిస్తున్నారు. అయితే వీటితో పాటు అదనంగా ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. కొత్తగా కారు కొనాలని అనుకునేవారికి ఇది అనుకూలంగా ఉండనుంది.

    ఖరీదైన కారు అనగానే మెర్సిడేస్ బెంజ్ గురించి ఆలోచిస్తారు. ఆ కారుకు గట్టి పోటీ ఇవ్వడానికి ఇది సిద్ధంగా ఉంది. దేశీయంగా ఉత్పత్తి చేసుకున్న ఈ కారులో ప్రయాణించే ఆ ఫీలింగ్ వెరే లెవల్లో ఉంటుందని అంటున్నారు. నవంబర్ నెల వరకు పండుగల సీజన్ కావడంతో వీటి సేల్స్ విపరీతంగా పెరిగాయి. అయితే ముందు ముందు ఈ కారును ఎంత మంది కొనుగోలు చేస్తారో చూడాలి.