Ram Charan and NTR : ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Ram Charan) కేవలం #RRR చిత్రంతో స్నేహితులు అవ్వలేదు. అంతకు ముందు నుండే వీళ్లిద్దరు మంచి స్నేహితులు. రామ్ చరణ్ సినిమాల్లోకి రాక ముందు నుండే వీళ్లిద్దరికీ పరిచయం ఉందట. ఆ పరిచయం కాస్త రాబోయే రోజుల్లో స్నేహం గా మారి, ఆ స్నేహం వీళ్ళిద్దరిని అన్నదమ్ములను చేసింది. #RRR మూవీ విడుదలకు ముందు వీళ్లిద్దరు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూస్ లో వీళ్ళు ఎంత మంచి స్నేహితులో, వీళ్ళ మధ్య ఏ రేంజ్ బాండింగ్ ఉందో చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ పుట్టిన రోజు, ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి పుట్టినరోజుకి మధ్య కేవలం ఒక్కరోజు గ్యాప్ మాత్రమే ఉంటుంది. లక్ష్మి ప్రణతి పుట్టినరోజు వేడుకలు పూర్తి అవ్వగానే, రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్ళేవాడిని అని, రామ్ చరణే స్వయంగా ఇంటికి వచ్చి తన ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీ కి తీసుకెళ్లేవాడని చెప్పుకొచ్చారు.
వీళ్ళ మధ్య అంత మంచి స్నేహం ఉంటుందట. అయితే రామ్ చరణ్ సినిమాల్లో ఎన్టీఆర్ భార్య ప్రణతి కి బాగా ఇష్టమైన సినిమా ఏదైనా ఉందా అంటే అది మగధీర చిత్రమట. చదువుకునే రోజుల్లో ఈ చిత్రాన్ని ఆమె తెగ చూసేదట, తన స్నేహితులతో కలిసి అప్పట్లో రెండు మూడుసార్లు థియేటర్స్ కి వెళ్లి చూసిందట. ఈ విషయాన్ని స్వయంగా జూనియర్ చెప్పుకొచ్చాడు. మగధీర చిత్రాన్ని ఆరోజుల్లో థియేటర్స్ లో చూడని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరేమో. కమర్షియల్ సినిమాలు రాజ్యం ఏలే రోజుల్లో ఇలాంటి సినిమా విడుదల అవ్వడంతో ప్రేక్షకులు ఒకటికి రెండు మూడు సార్లు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసేవారు. ఆ జాబితాలో లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranathi) కూడా ఉంది. ఆరోజుల్లోనే ఈ చిత్రానికి 133 కోట్ల రూపాయిల గ్రాస్ 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికీ ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా పిలవబడుతుంది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, వార్ 2 మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న ఆయన, త్వరలోనే ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాకి షిఫ్ట్ అవ్వబోతున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ఈ చిత్రం తర్వాత ఆయన సుకుమార్ తో ఒక సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ, ఆయనకంటే ముందుగా కిల్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. మైథాలజీ జానర్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇలా ఈ ఇద్దరు #RRR హీరోలు దూసుకుపోతున్నారు. అయితే ఎన్టీఆర్ దేవర హిట్ తో అభిమానులను ఫుల్ జోష్ తో నింపితే, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంతో భారీ ఫ్లాప్ అందుకొని అభిమానులను నిరాశపరిచాడు.