
రంగస్థలం సంచలన విజయం తరవాత రామ్ చరణ్ చేసిన ` వినయ విధేయ రామ ` చిత్రం ఆశించిన విజయాన్ని అందించ లేదు .చెర్రీ కి …అందుకే వెంట వెంటనే సినిమాలు చేయడం తగ్గించాడు సినిమా ఒప్పుకొనే ముందు.ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొంటున్నాడు. ప్రస్తుతం చరణ్ ‘ఆర్ ఆ ఆర్ ఆర్’ (రౌద్రం రణం రుధిరం ) సినిమా చేస్తున్నాడు. ఈ మల్టి స్టారర్ సినిమా తరువాత కొరటాల శివ చిత్రం ‘ఆచార్య’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నాడు. ఆ తరువాత రామ్ చరణ్ ఒక యువ దర్శకుడితో కల్సి సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఇండస్ట్రీ లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమా దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు వినిపిస్తోంది.
నవరసాలను సమ పాళ్లలో కలిపి వినోదాన్ని అందించే అనిల్ రావిపూడికి దర్శకుడిగా మంచి ట్రాక్ రికార్డు ఉంది. . ప్రస్తుతం అనిల్ ‘ఎఫ్ 2’ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ సినిమా చేయడానికి స్క్రిప్ట్ తో సిద్ధమవుతున్నాడు. అది చర్చల్లో ఉండగానే అనిల్ రావిపూడి తాజాగా రామ్ చరణ్ కి కథ వినిపించడం జరిగిందట …..కథ విన్న చెర్రీ అనిల్ రావిపూడి కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగి పోయింది అంటున్నారు. రామ్ చరణ్ ‘ఆచార్య సినిమా ‘ పూర్తి చేసేలోగా, అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమా పూర్తి చేస్తాడట. ఆ తరువాత చెర్రీ , అనిల్ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది .కాగా ఈ సినిమాని `వినయ్ విధేయ రామ ` `ఆర్ ఆర్ ఆర్ ` చిత్రాల నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తాడట .