Homeఎంటర్టైన్మెంట్కరోనా బ్యాక్ డ్రాప్ లో రెండు సినిమాలు

కరోనా బ్యాక్ డ్రాప్ లో రెండు సినిమాలు


వాస్తవ సంఘటనలు ఆధారం గా సినిమాల‌ను నిర్మించ‌డం ఎప్పటినుంచో ఉంది . ఆ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల ఫై సినిమాలు రూపొందుతున్నాయి . కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోతోంది. భారత్ లో ఇప్పటికే 21 రోజుల లాక్డౌన్ విధించిన ప్రభుత్వం.. దాన్ని మే 3 వరకూ పొడిగించింది. ఈ లాక్డౌన్ ఇతివృత్తంగా సినిమా తీయాలని కోలీవుడ్ నిర్మాత ఎం. విజయ భాస్కర్ రాజ్ నిర్ణయించారు. ‘21 డేస్’ పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. దర్శకుడిగా ఆయనకిదే తొలి చిత్రం. కథ, కథనం, మాటలు కూడా ఆయనే అందిస్తున్నారు. కరోనా వైరస్ పై ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తామని దర్శకుడు విజయ్ భాస్కర్ రాజ్ ప్రెస్ కి తెలిపారు కాగా ఈ చిత్రం తమిళ్ , తెలుగు , హిందీ భాషల్లో రూపొంద నుంది .

అలాగే తెలుగు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ కూడా యాదృచ్చికంగా క‌రోనా వైర‌స్‌ను ఆధారంగా చేసుకుని ఒక సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 50 శాతం పైగా పూర్త‌య్యింది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గ‌గానే మిగిలిన భాగాన్ని చిత్రీక‌రించ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ కూడా భాగస్వామి అని తెలిసింది ఇక పొతే ఈ చిత్రం లో అంద‌రూ కొత్త న‌టీన‌టులే న‌టిస్తున్నారు. నాని నిర్మించిన ” అ! “, రాజశేఖర్ హీరోగా వచ్చిన ` క‌ల్కి ` చిత్రాల త‌ర్వాత ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ట్ చేస్తున్న మూడో చిత్ర‌మిది. చూస్తుంటే ఇంకా చాలా చిత్రాలు కరోనా వైరస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చేట్టు ఉన్నాయి ..

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular