Ram Charan and Sukumar : ‘పుష్ప 2′(Pushpa 2) వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) తో ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ లోని నట విశ్వరూపాన్ని బయటకి తీసి, ప్రతీ హీరో ఆ రేంజ్ లో నటించాలి అనే బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసాడు. పుష్ప సిరీస్ పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ సృష్టించి ఉండొచ్చు కానీ, ‘పుష్ప’, ‘రంగస్థలం’ చిత్రాల్లో ఏ సినిమా బాగుంటుంది అని అడిగితే నూటికి 90 శాతం మంది రంగస్థలం పేరే చెప్తారు. అలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేసింది ఈ కాంబినేషన్. మళ్ళీ ఆ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి.
Also Read : రామ్ చరణ్, సుకుమార్ సినిమాకు ‘మిషన్ ఇంపాజిబుల్’ స్ఫూర్తి..ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చుతాయా?
సుమారుగా మూడేళ్ళ వరకు ‘పుష్ప 2’ చిత్రానికి తన విలువైన సమయాన్ని కేటాయించి, ఫుల్ గా ఒత్తిడికి గురైన డైరెక్టర్ సుకుమార్, ముందుగా రిఫ్రెష్ అవ్వడానికి దాదాపుగా 5 నెలల నుండి విశ్రాంతి మోడ్ లో ఉంటున్నాడు. మే నెలలో కూడా ఆయన పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోబోతున్నాడట. ఆ తర్వాత జూన్ నెలలో తన రైటర్స్ బృందం తో కలిసి స్క్రిప్ట్ రైటింగ్ మొదలు పెడుతాడట. రామ్ చరణ్, సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా మనం పల్లెటూరు వాతావరణం జానర్ లో తెరకెక్కుతుందని అనుకుంటాం. కానీ ఈ చిత్రాన్ని అభిమానుల అంచనాలకు పూర్తి భిన్నంగా, ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి యాక్షన్ జానర్ లో తెరకెక్కించబోతున్నారట. సుకుమార్ కి ఈ జానర్ చాలా కొత్త, అందుకే ఈ 5 నెలలు వివిధ రిఫరెన్స్ లను కూడా తీసుకున్నాడట. వాటి అన్నిటిని కలిపి ఒక అద్భుతమైన స్టోరీలైన్ ని ఆలోచించాడట.
జూన్ నెల నుండి ఈ స్టోరీ లైన్ మీద స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో ఉంటాడట సుకుమార్. ఇక సుకుమార్ రైటింగ్ బృందం లో డైరెక్టర్ బుచ్చి బాబు కూడా ఉంటాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. గతంలో ఆయన ‘పుష్ప 2’ కి కూడా పని చేసాడు. ఇప్పుడు రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ కి కూడా పని చేయబోతున్నాడు. ప్రస్తుతం బుచ్చి బాబు రామ్ చరణ్ తో ‘పెద్ది’ మూవీ తీస్తున్నాడు. జెట్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్ గానే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెద్ది మార్క్ సిగ్నేచర్ షాట్ ని సోషల్ మీడియా లో IPL టీమ్స్ అన్ని తెగ వాడేసాయి.
Also Read : రామ్ చరణ్,సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్..అభిమానులు కలలో కూడా ఊహించని కాంబినేషన్ ఇది!