Ram Charan , Sukumar
Ram Charan and Sukumar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ramcharan) ఫ్యాన్స్ ‘గేమ్ చేంజర్'(Game Changer) ఫలితం పై ఎంత నిరాశలో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూడేళ్ళుగా భారీ అంచనాలు పెట్టుకొని ఎదురు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ బలహీనమైన టేకింగ్ తో అభిమానుల సహనానికి థియేటర్స్ లో పరీక్ష పెట్టారు. ఫలితంగా మొదటి ఆట నుండే ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది. టాక్ ప్రభావం కారణంగా సంక్రాంతి అయినప్పటికీ కూడా ఈ చిత్రం కనీసం యావరేజ్ రేంజ్ కి కూడా వెళ్లలేకపోయింది. రామ్ చరణ్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. దీంతో రామ్ చరణ్ తానూ తదుపరి చేయబోయే సినిమాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బుచ్చి బాబు టీకెక్కిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ లో గ్యాప్ లేకుండా పాల్గొన్నాడు. ఇప్పుడు కాస్త బ్రేక్ రావడంతో డైరెక్టర్ సుకుమార్ తో భేటీ అవ్వడానికి అబుదాబి కి వెళ్ళాడు.
బుచ్చి బాబు(Buchi Babu Sana) సినిమా తర్వాత ఆయన సుకుమార్(Director Sukumar) తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ స్టోరీ గురించి అబుదాబి లో గత రెండు రోజుల నుండి చర్చలు జరుపుతున్నారు. అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక(Rashmika Mandanna) ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ‘పుష్ప’ సిరీస్ కి రష్మిక నటన కూడా బాగా ప్లస్ అయ్యింది. అనేక సన్నివేశాల్లో ఆమె పుష్ప క్యారక్టర్ ని లేపిన తీరు అద్భుతం. రామ్ చరణ్ తో తీయబోయే సినిమాలో కూడా హీరోయిన్ కి పెర్ఫార్మన్స్ కోసం ఫుల్ స్కోప్ ఉందట. ఆ క్యారక్టర్ కి రష్మిక తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరని సుకుమార్ కి అనిపించడంతో ఆమెని లాక్ చేద్దామని రామ్ చరణ్ తో అన్నాడని, రామ్ చరణ్ కూడా అందుకు ఒప్పుకున్నాడని లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో సాగుతున్న చర్చ.
ఈ ఏడాది లోనే బుచ్చి బాబు సినిమా పూర్తి అయ్యి అక్టోబర్ నెలలో విడుదల కానుంది. డిసెంబర్ నుండి సుకుమార్ తో సినిమా షూటింగ్ ని రామ్ చరణ్ మొదలు పెడతాడని అంటున్నారు. వచ్చే ఏడాదే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ హీరోకి పాదనటువంటి క్యారక్టరైజేషన్ ని రామ్ చరణ్ కోసం సిద్ధం చేశాడట డైరెక్టర్ సుకుమార్. పుష్ప క్యారక్టర్ తో అల్లు అర్జున్ ని ఆయన ఏ స్థాయిలో కూర్చోబెట్టాడో మన అందరికీ తెలిసిందే. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న తనకు రంగస్థలం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన రామ్ చరణ్ కి అంతకు మించిన క్యారక్టర్ ని డిజైన్ చేసి ఆయనకు బహుమతిగా ఇవ్వాలని సుకుమార్ ఫిక్స్ అయిపోయాడట. చూడాలి మరి రామ్ చరణ్ ని సుకుమార్ ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు అనేది.