Ram Charan and Sandeep Reddy Vanga : అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ (Sandeep Reddy Vanga)…ఆయన చేసిన సినిమాల ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప పేరు ను కూడా సంపాదించి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే అనిమల్(Animal) సినిమాతో పెను ప్రభంజనాలను క్రియేట్ చేసిన ఆయన ఇకమీదట రాబోయే సినిమాలతో కూడా మరిన్ని వండర్స్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దానికి అనుగుణంగానే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ సినిమాను తెరకెక్కించి స్పిరిటి తో ఒకేసారి ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియదంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా తర్వాత ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా గురించి ఎక్కువగా మ్యాటర్ అయితే రావడం లేదు. కానీ సందీప్ రెడ్డి వంగ తో ఒక సినిమా చేయబోతున్నాడనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. ఇక స్పిరిట్ సినిమా తర్వాత ఆ సినిమానే తను చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.
Also Read : ట్రాక్ లోకి వచ్చిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..సందీప్ రెడ్డి వంగ తో కొత్త సినిమా ప్రకటన!
మరి ఇంతలో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే కొన్ని డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ (Allu Arjun) ప్రాజెక్టు కనక లేకపోతే మాత్రం రామ్ చరణ్ సినిమాను లైన్ లో పెట్టే అవకాశాలైతే ఉన్నాయి.
మరి ఏది ఏమైనా సందీప్ రెడ్డివంగ రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్ లో మాత్రం ఒక సినిమా రాబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ కి మంచి గుర్తింపు ఉంది. అలాగే భారీ హైప్ కూడా క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి సందీప్ స్టార్ డైరెక్టర్ గుర్తింపును సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఏది ఏమైనా కూడా ఇక మీదట సందీప్ చేసే సినిమాల మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.