Peddi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బుచ్చిబాబు (Buchhi Babu) ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) తో ‘పెద్ది’ (Peddi అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పలు రికార్డులను సృష్టిస్తూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. బుచ్చి బాబు ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే ఆయన లైఫ్ చాలా బ్రైట్ గా ఉంటుంది. ఈ సినిమాతో కనక ఫెయిల్యూర్ ని మూట గట్టుకుంటే మాత్రం ఆయన కెరియర్ అంత అగమ్య గోచరంగా మారే పరిస్థితి అయితే ఏర్పడనుంది. దానికి కారణమేంటి అంటే సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదుగుతున్న రామ్ చరణ్ మార్కెట్ ను పెంచినట్టయితే అతన్ని మరికొంతమంది స్టార్ హీరోలు నమ్మి సినిమాలు ఇచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఒకవేళ రామ్ చరణ్ మార్కెట్ ను తగ్గించే విధంగా సినిమా ఉన్నట్టయితే మాత్రం ఏ స్టార్ హీరో కూడా బుచ్చిబాబుకు సినిమా ఇవ్వడానికి సాహసం చేయరు. కాబట్టి ఈ సినిమాను తీసే సందర్భంలో బుచ్చిబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంటుంది. తద్వారా వాళ్లను వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా హీరోలకి కూడా సరైన గుర్తింపు తీసుకొచ్చిన వారవుతారు.
Also Read : పెద్ది’ షాట్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? ఎలా క్రియేట్ చేశారంటే!
మరి ఇలాంటి సందర్భంలోనే బుచ్చిబాబు లాంటి దర్శకుడు తన తదుపరి సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. ఇండస్ట్రీలో తన మార్కు చూపిస్తాడా? లేదా పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచే గొప్ప గుర్తింపును తీసుకొచ్చే సినిమాను చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్న రామ్ చరణ్ తన నటనలో వైవిధ్యాన్ని చూపించాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే వేరియేషన్స్ ను చూపిస్తూ అల్టిమేట్ గా యాక్టింగ్ కనక చేసినట్లయితే మాత్రం రామ్ చరణ్ తన నటనలోని పోటెన్షియాలిటి మొత్తాన్ని బయటపెట్టిన వాడు అవుతాడు.
ఇక దానికి తోడుగా ఈ సినిమాతో బుచ్చిబాబు స్టార్ డమ్ కూడా మారిపోతుంది. బాలీవుడ్ హీరోలు సైతం అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించవచ్చు కాబట్టి ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమా మీదనే బుచ్చిబాబు కెరియర్ అనేది ఆధారపడి ఉంది.
Also Read : ‘పెద్ది’ పై రామ్ గోపాల్ వర్మ వైరల్ ట్వీట్..కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!